ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల అభ్యున్నతికి కృషి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:07 AM
అమలాపురం టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఆ సంస్థ ఎండీ, సొసైటీ చైర్మన్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాం ను ంచి పెండింగ్‌లో ఉన్న రూ.96కోట్ల బకాయిల విడుదలకు కృషి చేస్తున్నట్టు ప్రకటించారు. గతం

అమలాపురం టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఆ సంస్థ ఎండీ, సొసైటీ చైర్మన్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాం ను ంచి పెండింగ్‌లో ఉన్న రూ.96కోట్ల బకాయిల విడుదలకు కృషి చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలోనే బకాయిలు విడుదల చేయాలని అప్పటి ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో బకాయిలు విడుదల కోసం చర్చించానని, త్వరలోనే విడుదల కానున్నట్టు తెలిపారు. సభ్యులంతా సమన్వయంతో పనిచేస్తూ సొసైటీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. డాక్టర్ బీఆ ర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏబీసీడీ ఫుడ్ కోర్టు భవనంలో బుధవారం సొసైటీ కార్యదర్శి టి.త్రాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్, వైస్‌చైర్మన్, ఈడీ జి.నాగేంద్రప్రసాద్, ఫైనాన్స్ అండ్ ఆడిట్ ఈడీ ప్రసాద్, కార్యదర్శి టి.త్రాసు మాట్లాడారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి సమావేశం నిర్వహించడం జరుగుతుందని, తొలి సమావేశాన్ని విజయవాడలో నిర్వహిస్తామని, కోనసీమలో తొలిసారిగా రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించామన్నారు. 1952లో సొసైటీని ఏర్పాటు చేసి సంఘ సభ్యుల నుంచి డిపాజిట్లు సేకరించడంతో పాటు అవసరమైన వారికి రుణాలను అందిస్తున్నామన్నారు. తిరుమలరావు మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆసియా ఖండంలోనేనంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. 46వేల మంది సభ్యులతో రూ.2500 కోట్ల టర్నోవర్‌తో సొసైటీ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సంఘ సభ్యుల పిల్లల చదువులకు, పెళ్లిళ్లలకు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలను అందిస్తున్నామన్నారు. క్రెడిట్ సొసైటీ భవనం నిర్మాణం విషయంలో ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధుల మధ్య వివాదం జ రగగా కొద్దిసేపు సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అనంతరం త్రాసు ఆధ్వర్యంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 230 మంది డెలిగేట్స్ హాజరైన సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీనివాసరాజు, అనంతరామయ్య, వి.ప్రసాద్, వినోద్ పాల్గొన్నారు.