పిఠాపురంలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:30 AM
పిఠాపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది. ఇన్ని సం ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఉదాశీనం గా ఎందుకు ఉంటున్నారు. కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణాలు ఏమిటి... అంటూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సీరియస్ అయ్యారు. పిఠాపురంలోని పోలీసు స్టేషన్లల్లో సెటిల్మెంట్లు జరుగుతుండడం, ప్రైవేటు వ్యక్తుల హవా పెరిగిపోవడం, పలు కేసుల్లో ఉన్న అను మానితుడైన వ్యక్తిని రూరల్ ఎస్‌ఐ ఏకంగా 2 నెలలుగా తన జీ

కాకినాడ జిల్లా ఎస్పీ సీరియస్
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆరా
పిఠాపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది. ఇన్ని సం ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఉదాశీనం గా ఎందుకు ఉంటున్నారు. కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణాలు ఏమిటి... అంటూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సీరియస్ అయ్యారు. పిఠాపురంలోని పోలీసు స్టేషన్లల్లో సెటిల్మెంట్లు జరుగుతుండడం, ప్రైవేటు వ్యక్తుల హవా పెరిగిపోవడం, పలు కేసుల్లో ఉన్న అను మానితుడైన వ్యక్తిని రూరల్ ఎస్‌ఐ ఏకంగా 2 నెలలుగా తన జీపు ప్రైవేటు డ్రైవర్‌గా ఉం చుకున్నా ఉన్నతాధికారులు గుర్తించలేకపోవ డం తదితర అంశాలతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ 2 నెలల క్రితం బహిరంగ సభ వేదికగా చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసే లా పిఠాపురం పోలీసుల వ్యవహార శైలి ఉండ డాన్ని ప్రస్తావిస్తూ ‘తీరు మారలేదు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఎస్పీ తీవ్రంగా స్పందించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్‌తో పాటు సర్కిల్‌లోని నలుగురు ఎస్‌ఐలను ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. ఆంధ్రజ్యోతిలో ప్రస్తావించిన అంశాలతో పాటు రూరల్ ఎస్‌ఐ, ప్రైవేటు డ్రైవర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన నాటి నుంచి జరిగిన పరిణామాలపై వారిని ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి బ్యాచ్ ఆగడాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇకపై ఎటువంటి ఆరోపణలు వ చ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్రికల్లో వచ్చిన అన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని సూచించారు. పోలీసుస్టేషన్ల వద్ద ప్రై వేటు వ్యక్తులు ఎందుకు ఉంటున్నారని, ఫిర్యాదుదారులతో వారు ఎందుకు మాట్లాడాల్సి వ స్తోందని ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు పిఠాపురం పట్టణం, రూరల్, గొల్లప్రోలు, కొత్తపల్లి పోలీసు స్టేషన్ల పనితీరుపై నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. స్టేషన్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితి, గతంలో జరిగిన వ్యవహారాలు, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం, పోలీసింగ్ ఎలా ఉంది తదితర వివరాలను సేకరిస్తున్నాయి.
పిఠాపురం రూరల్ ఎస్‌ఐ సస్పెన్షన్
పిఠాపురం రూరల్, మార్చి 29 (ఆంధ్ర జ్యోతి): ఏసీబీకి పట్టుబడిన కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్‌ఐ ఎల్.గుణశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజులను 2024 అక్టోబరులో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు నుంచి తప్పించేందుకు ఎస్‌ఐ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం తీసుకుంటుండగా ఈనెల 24వ తేదీ రాత్రి రూరల్ ఎస్‌ఐ గుణశేఖర్‌తో పాటు అతడు వినియోగించే పో లీసు జీపుపై ప్రవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న నల్లా శివను ఏసీబీ డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. అప్పటి నుంచి ఎస్‌ఐ రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ నే పఽథ్యంలో ఎస్‌ఐ గుణశేఖర్‌ను విధులు నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.