Share News

టెంపుల్సే టార్గెట్‌...

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:23 AM

అమలాపురం రూరల్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రైస్‌ పుల్లింగ్‌తో చిన్నచిన్న మోసాలు చేస్తూ చెడు వ్యసనాలకు బానిసలై చివరకు ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాల బాట పట్టి వరుసగా నాలుగు చోరీలకు పాల్పడిన దొంగలు సీసీ కెమెరాలకు చిక్కారు. దర్యాప్తును వేగవంతం చేసిన అమలాపురం తాలూకా పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి వెండి ఆభరణాలతో పాటు కొద్ది నగదు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ

టెంపుల్సే టార్గెట్‌...
అమలాపురం తాలూకా పోలీసుస్టేషన్‌లో వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌

చెడు వ్యసనాలకు బానిసలై

దొంగతనాల బాట పట్టిన ఇద్దరి అరెస్టు

రూ.10లక్షల విలువైన

వెండి ఆభరణాలు స్వాధీనం

అమలాపురం రూరల్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రైస్‌ పుల్లింగ్‌తో చిన్నచిన్న మోసాలు చేస్తూ చెడు వ్యసనాలకు బానిసలై చివరకు ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాల బాట పట్టి వరుసగా నాలుగు చోరీలకు పాల్పడిన దొంగలు సీసీ కెమెరాలకు చిక్కారు. దర్యాప్తును వేగవంతం చేసిన అమలాపురం తాలూకా పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి వెండి ఆభరణాలతో పాటు కొద్ది నగదు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీ మ జిల్లా అమలాపురం తాలూకా పోలీసుస్టేషన్‌లో శనివారం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌ వి లేకర్లకు వివరించారు. పాండిచ్చేరి యానాంకు చెందిన మల్లాడి కాసురాజు (39), పచ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన కొల్లాటి తిరుపతిరాజు (36) మొదట్లో రైస్‌ పుల్లింగ్‌పేరుతో కొందరిని మోసం చేశారు. చెడు వ్యవసనాలకు బానిసలైన వారిద్దరు జట్టుకట్టి అమలాపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచే సమీప ప్రాంతాల్లోని ఆలయాల వద్ద రెక్కీలు నిర్వహించి వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. అల్లవరం మండలం సామంతకుర్రులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ఏడాది జనవరి 24న చొరబడి 4.800 కిలోల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. అమలాపురం తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలోని సవరప్పాంలెం గ్రామంలో శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఫిబ్రవరి 28న చోరీకి పాల్పడి 5.10 కిలోల వెండి ఆభరణాలను చోరీ చేశారు. కొమరగిరిపట్నం షిర్డిసాయిబాబా ఆలయం, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శ్రీవిజయకనకదుర్గమ్మ ఆలయాల్లో హుండీల నుంచి నగదును అపహరించుకుపోయారు. దీంతో కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌, ఎస్‌ఐ వై.శేఖర్‌బాబు, క్రైమ్‌ సిబ్బంది బృందంగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డ కాసురాజు, తిరుపతిరాజులను శనివారం ఉదయం ముత్యాలపల్లి గ్రామంలో అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10లక్షల విలువైన పది కిలోల వెండిని, ఆభరణాలను, రూ.2500 నగదును, నేరాలకు చేయడానికి ఉపయోగించిన మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. చోరీలకు పాల్పడ్డ వారిని అమలాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరుచగా రిమాండు విధించినట్టు తెలిపారు. కేసును చేధించిన పోలీసు అధికారులతో పాటు క్రైమ్‌ సిబ్బంది వి.సుబ్బారావు, సీహెచ్‌ ఏసుబాబు, బి.శివరామకృష్ణ, ఎం.ధర్మరాజు, నాగరాజులను ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ కృష్ణారావు రివార్డులు అందజేయనున్నట్టు డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. అన్ని ఆలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత కమిటీసభ్యులకు సూచించారు.

Updated Date - Mar 30 , 2025 | 12:23 AM