Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:14 AM

కాకినాడ/పిఠాపురం/గొల్లప్రోలు/కొత్తపల్లి/ రాజమ హేంద్రవరం సిటీ - ఆంధ్రజ్యోతి): జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉదయమంతా ఎండ కాచి ఉక్కబోయగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రికి పెనుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు సైతం కూలిపోయాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలుముకుంది. గాలుల తాకిడికి రహదారులపై ఇసుక, దుమ్ము సైతం లేచిం ది. ఆ సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల తో

ఈదురుగాలుల బీభత్సం
రాజమహేంద్రవరంలో మెరుపులు

‘తూర్పు’లో భారీ వర్షం

నేలకొరిగిన చెట్లు

తెగిపడిన విద్యుత్‌ తీగలు

గ్రామాల్లో అంధకారం

తడిచిపోయిన ధాన్యం

కాకినాడ/పిఠాపురం/గొల్లప్రోలు/కొత్తపల్లి/ రాజమ హేంద్రవరం సిటీ - ఆంధ్రజ్యోతి): జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉదయమంతా ఎండ కాచి ఉక్కబోయగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రికి పెనుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు సైతం కూలిపోయాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలుముకుంది. గాలుల తాకిడికి రహదారులపై ఇసుక, దుమ్ము సైతం లేచిం ది. ఆ సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల తోపాటు ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఆదివారం సా యంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రి 9 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హోరుగాలితో జనం హడలెత్తిపోయారు. కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంతోపా టు పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, కొత్తపల్లి, ప్ర త్తిపాడు మండలాల్లోను, కోనసీమ జిల్లాలోని అమ లాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, కె.గంగవరం తదితర చోట్ల, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం నగరంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోను భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్‌స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తోటల్లో మామిడికాయలు నేలరాలిపోయాయి. ధాన్యం రాశులు తడిచిపోయాయి. నువ్వులు, అపరాలు, ఇతర మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. కాకినాడ మెయిన్‌రోడ్డులోను ఓ భారీ వృక్షం నేలకూలింది. రామారావుపేట పాము వారి వీధిలో కరెంటు తీగలపై చెట్టు పడింది. గొల్లప్రోలు-తాటిపర్తి, గొల్లప్రోలు-చెందుర్తి ఆర్‌అండ్‌బీ రోడ్లతోపా టు పలు ప్రధాన రహదారులపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. 50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు కొత్తపల్లి మండలం ఉప్పా డలో కొబ్బరి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

Updated Date - Apr 14 , 2025 | 01:14 AM