పింఛన్ల పంపిణీలో ఆరో స్థానం
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:33 AM
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజు మంగళవారం 95.67 శాతం పంపిణీ జరిగింది.

రాజమహేంద్రవరం,ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజు మంగళవారం 95.67 శాతం పంపిణీ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పిం ఛన్లు పంపిణీ చేశారు.వేరే ప్రాంతాల్లో లబ్ధిదారులు ఉండిపోవడం తదితర కారణాల వల్ల మిగతావారికి పంపిణీ చేయలేకపో యి నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం పింఛన్ల సంఖ్య 2,35,076గా ఉంది. అందులో తొలిరోజు 2,24,891 మందికి పింఛన్ల సొమ్ము అందజేశారు. మొత్తం జిల్లాకు రూ.102,28,25,500 అందులో కోట్ల పింఛన్ల సొమ్ము విడుదల కాగా రూ.97, 63,87,000 పంపిణీ చేశారు.తొలి రోజు పింఛన్ల పంపిణీలో జిల్లాకు 6వ స్థానం లభించింది. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్వ యంగా లబ్ధిదార్ల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పలు నియో జకవర్గాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేయడం గమనార్హం.