ఉపాధిలో ‘తూర్పు’ భేష్
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:39 AM
ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల్లో రాష్ట్రంలోనే మెరుగైన స్థానాల్లో తూర్పుగోదావరి నిలిచిందని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు.

పల్లె పండుగలో రెండో స్థానం
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల్లో రాష్ట్రంలోనే మెరుగైన స్థానాల్లో తూర్పుగోదావరి నిలిచిందని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లా ప్రగతి నివేదికను ఆమె గురువారం విడుదల చేశారు. 11,754 కుటుంబాలకు 100 రోజుల పనిదినాలను కల్పించడం జరిగిందని.. దీంతో లేబర్ బడ్జెట్‌లో 102.07 శాతంతో రాష్ట్రంలో తూర్పుగోదావరి ఆరో స్థానంలో నిలి చిందన్నారు. జిల్లాలో 1 లక్షా 247 కుటుంబాల్లో 1,32,954 మంది ఉపాధి కూలీలకు 51,88,790 పనిదినాలు కల్పించడం ద్వారా రూ.131కోట్లు వేతనాల రూపంలో చెల్లించామన్నారు. ఎస్పీ కుటుంబాలకు 18.67 లక్షలు, ఎస్టీ కుటుం బాలకు 1.02 లక్షల పనిదినాలు కల్పిం చామ న్నారు.రూ.225 రోజువారీ వేతనం చెల్లించా మన్నారు. 2025-26 ఏడాదిలో సగటున దినసరి వేతనం రూ.300 వరకూ పొందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. పల్లె పండుగలో జిల్లాలో 149.50 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లను రూ.72 కోట్లతో నిర్మించి రాష్ట్ర ంలో జిల్లా రెండో స్థానంలో, పాడి రైతులకు సంబంధించి 583 పశువుల షెడ్లను రూ.9.85 కోట్లతో నిర్మించి రాష్ట్రంలో ఏడో స్థానంలో, 373 మంది సన్న, చిన్నకారు రైతు లకు రూ.643.50 ఎకరాల్లో రూ.87.90 లక్షల వ్యయంతో పండ్ల తోటల పెంపకం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం ద్వారా ప్రథమ స్థానంలో నిలిచామ న్నారు.112 సాగునీటి చెరువుల(ఫారం పాండ్లు) ను రూ.55లక్షలతో పూర్తి చేశామన్నారు.
రైతుల సమక్షంలోనే రీసర్వే చేయండి
రెండో దశ రీ సర్వే పరిశీలనలో కలెక్టర్ ప్రశాంతి
దేవరపల్లి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): భూ ముల సమగ్ర కొలతల నిర్ధారణకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ఎటువంటి సమస్యలు లేకుండా రీసర్వే నిర్వ హించడం జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. దేవరపల్లి మండలం కురుకూరు పొలాల్లో గురువారం సాయంత్రం రెండో దశ రీసర్వే పనులు పరిశీలించారు. రైతులు, అధికా రుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనం తరం రైతు సేవాభవనంలో రైతులతో సమీ క్షించారు. క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వేకు సంబంధించి పలు ఫిర్యాదులు వస్తున్న దృ ష్ట్యా రెండో దశ రీసర్వే చేయడం జరు గు తుందన్నారు. గతంలో చేపట్టిన రీసర్వేపై కొల తల్లో వ్యత్యాసాలు, ఇతర అభ్యంతరాల నేప థ్యంలో సీసీఎల్ కమిషనర్ ఆదేశాలను అను సరించి క్షేత్రస్థాయిలో రెండో దశ రీసర్వే నిర్వ హిస్తున్నట్టు తెలిపారు. రికార్డులను సక్రమం గా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. రైతుల సమక్షంలోనే రీసర్వే చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వ హించాలన్నారు. కురుకూరులో 1050 మంది రైతులకు చెందిన 25 వేల ఎకరాల భూమిలో 80 శాతం తప్పులతడకలుగా రీసర్వే జరిగిం దని రైతులు యలమాటి భాస్కరరావు, కొయ్య లమూడి అచ్యుతరాయుడు, కలగర శ్రీనివాస్, కొయ్యలమూడి శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తప్పుల తడకలుగా ఎందుకు నమోదయ్యా యని వీఆర్వోను ప్రశ్నించారు. ఆ తప్పులు మరలా జరగకుండా రీసర్వే చేయాలన్నారు. ప్రస్తుతం రెండు టీమ్‌లు రీసర్వే చేస్తున్నా యని రైతుల కోరిక మేరకు మూడో టీమ్ కూడా ఏర్పాటు చేసి రీసర్వే త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎస్.చినరాముడు, ఆర్‌డీవో రాణిసుస్మిత, తహశీల్దార్ ఎం.శ్రీనివాస్, ఐఓఎస్ వెంకటేశ్వ రరావు, సర్వేయర్ ఢిల్లేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కొయ్యలమూడి అనంతలక్ష్మి, రైతులు బేతిన వెంకట్రావు,మల్లెల వెంకటేశ్వరరావు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.