ఇసుక రవాణాకు కొత్త కష్టాలు
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:41 AM
ఇసుక ర్యాంపుల్లో డివైడర్‌లు మొరాయించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు
కొవ్వూరు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : ఇసుక ర్యాంపుల్లో డివైడర్‌లు మొరాయించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి ఇసుక రవాణాకు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేసింది. ఇసుక రవాణాచేసే వాహనాన్ని ముందుగా ఫొటో తీయాలి. వివరాలు రిజిస్ట్టేష్రన్, ఇసుక లోడింగ్ చేసుకున్న తరువాత మరోసారి వాహనం ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. దీంతో పాటు నూతన ప్రక్రియలో వీఆర్వో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో డివైడర్‌లు మొరాయిండం, వీఆర్వోలు లాగిన్ అవ్వక పోవడంతో మధ్యాహ్నం వరకు బిల్లులు మంజూరు కాక ఇసుక రవాణాకు అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం 12 గంటలకు వరకు ఇసుకకు వచ్చిన లారీలన్నీ ర్యాంపుల్లోనే నిలిచిపోయాయి. మండలంలోని వాడపల్లి ర్యాంపులో బిల్లులు జనరేట్ కాకపోవడంతో ఇసుకకు వచ్చిన లారీలు వెనుదిరిగాయి. కుమారదేవం ఓపెన్ రీచ్‌లో సాయం త్రం వరకు బిల్లులు మంజూరు కాలేదు. కొవ్వూరు, ఎరినమ్మ, ఔరంగాబాద్, ఆరికిరేవుల, దండకుంట ర్యాంపుల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. వాడపల్లి, కుమారదేవం ర్యాంపుల వద్ద లారీలు బారులు తీరాయి.బిల్లులు మంజూరుకు సంబంధించి డివైడర్లలో సాంకేతిక సమస్యలతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యా రు. శుక్రవారం నుంచైనా నూతన విధానం సక్రమంగా అమల్లోకి రావాలని నిర్వాహకులు, వాహనదారులు ఎదురుచూస్తున్నారు.