రిజిస్ట్రేషన్లకు.. స్లాట్ బుకింగ్
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:07 AM
: ప్రతి శాఖను సంస్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా ప్రభు త్వం కృషి చేస్తోంది. దీనిలో రిజిస్ట్రేషన్ల శాఖలో ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొ స్తోంది.

గంటకు 12 స్లాట్లు
టైమ్‌కి రాకపోతే రద్దు
రాజమండ్రి ఆర్‌వోలో సేవలు
సమయం వృథాకు స్వస్తి
రాజమహేంద్రవరం, మార్చి 31 (ఆంధ్ర జ్యోతి) : ప్రతి శాఖను సంస్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా ప్రభు త్వం కృషి చేస్తోంది. దీనిలో రిజిస్ట్రేషన్ల శాఖలో ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొ స్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ల తిప్పలను తప్పించ డానికి ప్రభుత్వం నూతన ఆలోచన చేసింది. ఉదయం రిజిస్ట్రేషను ఆఫీస్‌కి వెళితే సాయం త్రం వరకూ వేచి ఉండే పరిస్థితికి స్వస్తి పల కనుంది. దీనిలో భాగంగా పాస్‌పోర్టుల మాది రిగా స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని ఈ నెల 4 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషను అవసరం ఉన్న వాళ్లు ట్ఛజజీట్టట్చ్టజీౌుఽ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైటులోకి వెళి తే అందుబాటులో ఉన్న స్లాట్లు కనిపిస్తాయి. క్రయవిక్రయదారుల్లో ఎవరో ఒకరు స్లాట్ బుక్ చేసిన వెంటనే వారికి ఓటీపీ మెసేజ్ ద్వారా వస్తుంది. దానిని రిజిస్ట్రేషను సమయంలో రిజి స్ట్రారుకు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి జిల్లాకు ఒక రిజిస్ట్రారు కార్యాలయానికి ఈ సదుపాయం పరిమితం చేశారు. క్రమేణా వచ్చే సమస్యలను అధిగమించి అన్ని రిజి స్ట్రారు కార్యాలయాలకు దీనిని వర్తింపజేయను న్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రిజిస్ట్రారు కార్యాలయంలో ఈ సేవలు అందు బాటులో ఉండనున్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ గం టకు 12 చొప్పున స్లాట్లు ఉంటాయి. ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ సమయానికి రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే అరగంటలో రిజిస్ట్రేషను పూర్తవుతుందని జిల్లా రిజిస్ట్రారు రెడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. స్లాట్ సమ యం నుంచి గంట లోపుగా స్లాట్ బుక్ చేసు కున్నవారు రాకపోతే రద్దవుతుందన్నారు. అందుబాటులో ఉన్న స్లాట్లకు అనుగుణంగా మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంద న్నా రు.దీని వల్ల తమ కార్యాలయాల్లో క్రయవిక్ర యదారులు ఎక్కువ సేపు వేచి ఉండే అవస రం ఉండదన్నారు.ఈ సదుపాయాన్ని వినియో గదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.