ఇద్దరు బాధితులకు మంత్రి సుభాష్ ఆర్థికసాయం
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:19 AM
భవనంపై నుండి పడి గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు కొత్తూరు గ్రామానికి చెందిన అలసాని ప్రసాద్‌కు మంత్రి సుభాష్ ఆర్థికసాయం అందచేశారు.

రామచంద్రపురం(ద్రాక్షారామ), ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): భవనంపై నుండి పడి గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు కొత్తూరు గ్రామానికి చెందిన అలసాని ప్రసాద్‌కు మంత్రి సుభాష్ ఆర్థికసాయం అందచేశారు. భవనం పైనుంచి బాధితుడు పడిపోవడంతో వెన్నెముక దెబ్బతిని నడవలేని పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పార్టీనాయకుల ద్వారా తెలుసుకున్న మంత్రి టిడ్కో గృహానికి వెళ్లి ఆర్థికసాయం అందచేశారు. రూ 15 వేలు పింఛను మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుబ్బలవారిపేటకు చెందిన గుబ్బల గోపి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి రూ.5 వేలు ఆర్థికసాయం అందచేశారు. మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి పంపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమినాయకులు గరిగిపాటి సూర్యనారాయణమూర్తి ఉన్నారు.