Share News

అన్ని కోణాల్లో నాగాంజలి కేసు దర్యాప్తు

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:32 AM

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 2(ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో ఫార్మాలజిస్ట్‌గా పనిచేస్తున్న నల్లపు నాగాంజలి ఆత్మహత్య యత్నం సంఘటనకు సంబంధించి ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని డీఎస్పీ భవ్యకిషోర్‌ తెలిపారు. బుధవారం ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెల 24వ తేదీన ఆస్పత్రి డ్యూటీలో ఉన్న నాగాంజలి ఆత్మహత్య యత్నం చేసిందని ఆమె తండ్రి నల్లపు దుర్గారావు ఫిర్యాదు చేయడంతో క్రైమ్‌ నెంబర్‌ 54/2025 యూ/ఎస్‌ 74,79, 351(2), 226 బీ ఎన్‌ ఎస్‌

అన్ని కోణాల్లో నాగాంజలి కేసు దర్యాప్తు
మాట్లాడుతున్న డీఎస్పీ భవ్యకిషోర్‌

కొంతమంది రాజకీయ లబ్ధికి ఈ సంఘటనను వాడుకోవడం సరికాదు : డీఎస్పీ

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 2(ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో ఫార్మాలజిస్ట్‌గా పనిచేస్తున్న నల్లపు నాగాంజలి ఆత్మహత్య యత్నం సంఘటనకు సంబంధించి ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని డీఎస్పీ భవ్యకిషోర్‌ తెలిపారు. బుధవారం ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెల 24వ తేదీన ఆస్పత్రి డ్యూటీలో ఉన్న నాగాంజలి ఆత్మహత్య యత్నం చేసిందని ఆమె తండ్రి నల్లపు దుర్గారావు ఫిర్యాదు చేయడంతో క్రైమ్‌ నెంబర్‌ 54/2025 యూ/ఎస్‌ 74,79, 351(2), 226 బీ ఎన్‌ ఎస్‌ (354, 909, 506, 309 ఐపీసీ) 75,78, 115(2), 64, 108, ఆర్‌/డబ్ల్యు 56 బీఎన్‌ఎస్‌ (354-ఏ, 354-డీ, 323, 376, 306 ఆర్‌/డబ్ల్యు 116 ఐ పీసీ) గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. ఈ కేసులో నిందితుడు దువ్వా డ మాధవరావుదీపక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. నాగాంజలి రాసిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా ఈ కేసును రేప్‌ కేస్‌గా అల్టర్‌ చేసి సెక్షన్లు మార్పు చేసి ఆస్పత్రి సీసీ పుటేజ్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలానే దీపక్‌ను సమగ్ర వి చారణ చేసేందుకు పోలీస్‌కస్టడీకి ఇవ్వమని కోర్టును కోరడం జరిగిందన్నారు. నాగాంజలి ఆరోగ్య విషయం పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ డాక్టర్ల కమిటీని నియమించారని, ఆ కమిటీ నాగాంజలి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పరిశీలిస్తోందని తెలిపారు. ప్రస్తుతం నాగాంజలి వెంటిలేటర్‌ మీద ఉండటం, వెంటిలేటర్‌ తీసేసిన ఎడల ఆమె చనిపోవచ్చని వైద్యులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో నిష్పక్షపాతంగా ఎటు వంటి అనుమానాలకు, అపోహలకు తావు లేకు ండా పూర్తి పారదర్శంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. అయితే ఈ కేసు విషయంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం నాగాంజలి ఆత్మా హత్య ఘటనను వాడుకుంటున్నారని, సరైన పద్ధతి కాదని డీఎస్పీ తెలిపారు. ప్రకాష్‌నగర్‌ సీఐ బాచీలాల్‌, ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:32 AM