Share News

ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:16 AM

అమలాపురం/ముమ్మిడివరం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం జరిగిన పదో తరగతి సోషల్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు జిల్లాలోని 110 పరీక్షా కేంద్రాల్లో 18,945 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 18,836 మంది (99. 42 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. 109 మంది విద్యార్థు

ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
రాయవరం జడ్పీ హైస్కూల్‌లో టెన్త్‌ బాలికల వీడ్కోలు సెల్ఫీ

రేపటి నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

అమలాపురం/ముమ్మిడివరం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం జరిగిన పదో తరగతి సోషల్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు జిల్లాలోని 110 పరీక్షా కేంద్రాల్లో 18,945 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 18,836 మంది (99. 42 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. 109 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో 9427 మంది బాలురకుగాను 9363 మంది (99.32 శాతం) హాజరుకాగా 64 మంది గైర్హాజరయ్యారు. అలాగే బాలికలకు సంబంధించి 9518 మందికిగాను 9473 మంది (99.53శాతం) హాజరుకాగా 45 మంది విద్యార్థినులు గైర్హాజరయ్యారు. జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాల్లో డీఈవో డాక్టర్‌ షేక్‌ సలీంబాషా, డీవైఈవో జి.సూర్యప్రకాశం ఆరు పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆరు పరీక్షా కేంద్రాలను, ఎంఈవోలు ఏడు పరీక్షా కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌గానీ, మాల్‌ ప్రాక్టీస్‌గానీ జరగలేదని, పరీక్ష లు ప్రశాంతంగా ముగిసినట్టు డీఈవో సలీంబాషా తెలిపారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించడంలో జిల్లాస్థాయి పరిశీలకు లు మువ్వా రామలింగం ముఖ్యపాత్ర వహించారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్యశాఖ ఆధ్వర్యం లో వైద్యశిబిరాల ఏర్పాటుతోపాటు 144 సెక్షన్‌ విధించడం, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడంలో అధికారులు చేసిన కృషిని అభినందించారు.

మూల్యాంకనం ఇక మొదలు

అమలాపురం సూర్యనగర్‌లోని జడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నట్టు డీఈవో సలీంబా షా తెలిపారు. గురువారం నుంచి 9వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుందన్నారు. వివిధ పాఠశాలల నుంచి చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, ప్రత్యేక సహాయకులుగా నియమితులైన ఉపాధ్యాయులను మూల్యాంకనం నిమిత్తం ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, మండల విద్యాశాఖాధికారులు వారిని విధుల నుంచి రిలీవ్‌ చేయాలని, బుధవారం ఉదయం వీరంతా రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Updated Date - Apr 02 , 2025 | 01:16 AM