CM Chandrababu:సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:05 PM
CM Chandrababu: పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ4 విధానం అమల్లోకి తీసుకువస్తున్నామని అన్నారు. ప్రజలు, యువత భవిష్యత్ బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. తన జీవితం ప్రజా సేవకే అంకితమని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ దగ్గర కఠోరమైన క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపారు.

అమరావతి: తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని...తాను ఎప్పుడూ తప్పు చేయనని ఏపీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన జీవితం ప్రజాసేవకే అంకితమని.. తనకు మరే కోరికలు లేవని అన్నారు.. తాను 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి 4 సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కఠోర క్రమశిక్షణతో ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ప్రజల జీవితం బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. అవినీతి లేని పాలన అందించడం తన సుపరిపాలన అని ఉద్ఘాటించారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిoచానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
జీరో పావర్టీ లక్ష్యంగా పీ4
P4 కార్యక్రమాన్ని ఆదివారం నాడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. P4 లోగో, పోర్టల్‌ను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. జీరో పావర్టీ లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్ మోడల్‌ను ఏర్పాటు చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న పదిశాతం మంది.. 20 శాతం నిరుపేదలను.. ఆదుకుని పైకి తీసుకొచ్చేలా P4 కార్యక్రమం రూపకల్పన చేశారు. దశల వారీగా 50 లక్షల మంది నిరుపేదలను ఆదుకునేలా కార్యక్రమం చేపట్టారు. P4 కోసం ఇప్పటికే 28 లక్షల కుటుంబాలను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. P4తో లబ్ధి పొందే వారిని 'బంగారు కుటుంబం'గా నామకరణం చేసింది. తొలి P4 కుటుంబంగా మంగళగిరి పరిధి కురగల్లుకు చెందిన.. కడియం నరసింహ, సుశీల ఎంపిక చేసింది. రెండో బంగారు కుటుంబంగా ఇమాన్యుయేల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. భవిష్యత్‌లో అమరావతి రూపురేఖలు మారిపోతాయని అన్నారు. అమరావతి గొప్పగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చంద్రబాబు పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. తప్పకుండా పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పేదరికం లేని సమాజానికి కృషి..
తన కుటుంబం కోసం హెరిటేజ్ సంస్థ పెట్టానని..వాళ్లు తనపైన ఆధారపడరని.. తానే తన కుటుంబంపై ఆధారపడతానని వ్యాఖ్యానించారు. భువనేశ్వరితో హెరిటేజ్ ఇప్పుడు పెద్ద సంస్థగా పెరిగిందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు చాలా మంది చనిపోయారని... వారి కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టానని గుర్తుచేశారు.. ఇక్కడికి 10 వేల బంగారు కుటుంబాలు వచ్చాయన్నారు. ఉగాది ..తెలుగు వారి తొలి పండుగ అని తెలిపారు. అందుకే పేదరికం లేని సమాజం కోసం శ్రీకారం చుట్టానని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచిస్తారని... ఆయన స్వార్థం కోసం ఆలోచించరని చెప్పారు.
పీవీ నరసింహారావు వల్ల దేశం అభివృద్ధి..
అలాంటి పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. పీ4 లాంటి కార్యక్రమాలంటే ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి చాలా ఇష్టమని చెప్పారు. 1991 తర్వాత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని గుర్తుచేశారు. పీవీ వల్ల దేశం ఇలా అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఐటిని పరిపాలనలో అనుసంధానం లాంటి కార్యక్రమాలు అమలు చేశానని చెప్పారు. ఎన్టీఆర్ మానవతా వాదిగా పేదవారి సంక్షేమానికి శ్రీకారం చుట్టారని ఉద్ఘాటించారు. 2 రూపాయలకు కేజీ బియ్యం ప్రవేశపెట్టారని తెలిపారు. 1991 ఎంతో మంది వ్యాపారరంగంలో ముందుకు వెళ్లారని సీఎ చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News