నేటి నుంచే ఇంటర్ ‘ద్వితీయ’ తరగతులు
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:23 AM
ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులతో ద్వితీయ సంవత్సరం తరగతులన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 2025–26 కొత్త విద్యాసంవత్సరం మంగళవారం ప్రారంభమవుతోంది.

తొలిరోజునే పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు
మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం
24 నుంచి జూన్ 1వరకు వేసవి సెలవులు
ఏలూరు అర్బన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులతో ద్వితీయ సంవత్సరం తరగతులన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 2025–26 కొత్త విద్యాసంవత్సరం మంగళవారం ప్రారంభమవుతోంది. తొలిరోజునే ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలను పంపిణీ చేయడానికి వీలుగా ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు ఆయా కళాశాలలకు అందజేశారు. వీటిని 19 ప్రభుత్వ, 31 హైస్కూల్ ప్లస్, 3 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు స్థానిక ప్రజా ప్రతి నిధుల ద్వారా అందజేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఇవిగాక మరో 6 సోషల్ వెల్ఫేర్, 3 ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు ఉండగా, వీటిలో ద్వితీయ సంవత్సరం తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై మార్గదర్శ కాలు రాలేదని అధికార వర్గాలు వివరించాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ జూని యర్ కళాశాలల నుంచి ఈ ఏడాది మొత్తం 18,853 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా, వీరంతా ద్వితీయ సంవత్స రం తరగతులకు అర్హత సాధించనట్టుగా పరి గణిస్తారు. ద్వితీయ సంవత్సరం తరగతులు మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. నిర్దేశిత మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం ఏలూరులో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధుల్లోవున్న జూనియర్ లెక్చరర్లు మినహా, మిగతా అధ్యాపకులంతా కళాశాల విధులకు హాజరు కావాలని డీవీఈవో ప్రభాకరరావు ఆదేఽశాలు జారీ చేశారు. మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 3న ముగియనుంది. ప్రస్తుతం పదో తర గతి పరీక్షలు రాసిన బాల బాలికలు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు వీలుగా ఈనెల 7నుంచి అన్ని ప్రభుత్వ కళాశాలల్లో బ్రిడ్జి క్లాసులు ప్రారంభించడానికి జిల్లా అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం పాఠ్యపుస్తకాల సిలబస్ మారిపోను న్నందున కొత్తసిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకా లు కొద్దిరోజుల్లో జిల్లాకు రానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరికీ వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 2న పునఃప్రారంభ మవుతాయి. ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడినవెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రక్రియ ప్రారంభం కానుండడం, రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉండడంతో ఈ దఫా జూనియర్ లెక్చరర్లకు వేసవి సెలవులు పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉండబోదని అధ్యాపక వర్గాలు చెబుతున్నాయి.