Share News

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:01 PM

ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, యు వజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, మార్చి15(ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, యు వజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నమండెం మండలం మోతినగర్‌లో రూ.7.50 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. దీంతో ప్రాధాన్యత క్రమంలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన మోటారును స్విచ ఆన చేసి గ్రామానికి నీటి సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలే ధ్యేయం

రాయచోటిటౌన, మార్చి15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 11:05 PM