Share News

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

ABN , Publish Date - Mar 15 , 2025 | 10:58 PM

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని డిప్యూటీ సీఈవో మైథిలి తెలిపారు.

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు
రైల్వేకోడూరు: ప్లాస్టిక్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా డిప్యూటీ సీఈవో మైథిలి

డిప్యూటీ సీఈవో మైథిలి

రైల్వేకోడూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని డిప్యూటీ సీఈవో మైథిలి తెలిపారు. శనివారం రైల్వేకోడూరు లో ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌ సముద్రాలను ఉక్కిరిబబిక్కిరి చేస్తున్నాయన్నారు. తద్వారా సముద్ర జీవులకు హాని కల్గిస్తున్నాయన్నారు. తాబేళ్లు, సీల్స్‌, పక్షులు, జంతువులు ప్లాస్టిక్‌ వ్యర్థాలలో చిక్కుకుని గాయాలు, మరణానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు ప్లాస్టిక్‌ సంచులు, సా్ట్రలు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లను నిషేధించాయన్నారు. రీసైక్లింగ్‌ కోసం టేక్‌-బ్యాక్‌ కార్యక్రమాలను అమలు చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలను మాత్రమే రీసైకలింగ్‌ చేస్తున్నారన్నారు.చాలా వరకు ప్లాస్టిక్‌ను పూడ్చి పెట్టడం, కాల్చి వేయడం చేయాలన్నారు. ప్రతి ఏటా దాదాపు 8 మిలియన టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్లాస్టిక్‌ సంచి సగటున 12 నిమిషాలు ఉపయోగించబడుతుందన్నారు. కానీ కుళ్లిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందన్నారు. ప్రపం చ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1 మిలియన ప్లాస్టిక్‌ బాటిళ్లు కొనుగోలవుతున్నాయన్నారు. 2050 నాటికి సముద్రంలో ప్లాస్టిక్‌ బరువు అన్ని చేపల బరువును మించి పోతుందన్నారు. బా ధ్యత గల పౌరులు ఒక సారి ఉపయోగించే ప్లాస్టిక్‌లను తిరస్కరించాలని తెలిపారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ప్లాస్టిక్‌ వినియోగం పూర్తి గా తగ్గిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగార్జునరావు, రైల్వేకోడూరు పంచాయతీ ఈవో వరప్రసాద్‌రావు, టీ డీపీ యువ నాయకులు పోతురాజు నవీన, నార్జాల హేమరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రజలు తోడ్పడాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రజలు తోడ్పడాలని జిల్లా డిప్యూటీ సీఈవో మైథిలి తెలిపారు. శనివారం రైల్వేకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛ భారత కార్యక్రమం లో స్వచ్ఛందంగా పాల్గొన్నాలని తెలిపారు. అధికారులు, సర్పంచులు, వార్డు సభ్యులు అందరూ కలిసి స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

వాడి పారేసే ప్లాస్టిక్‌ను అమ్మితే రూ.లక్ష జరిమానా

పెనగలూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అన్నిరకాల వ్యాపారులు, దుకాణాల యజమానులు ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్‌ వస్తువులను ప్రజలకు అమ్మితే రూ.లక్ష వరకు జరిమానా ఉంటుందని ఎంపీడీవో ఎస్‌.విజయరావు హె చ్చరించారు. శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కోమంతరాజపురం పంచాయతీ పరిధిలోని బెస్తపల్లె మూడు రోడ్ల కూడలిలో గల దుకాణ యజమానులతో ఆయన మాట్లాడారు. పెనగలూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బాలకృష్ణ, పార్లమెంట్‌ తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాంప్రసాద్‌నాయుడు, మండల నాయకుడు నరేష్‌ బాబు పాల్గొన్నారు. ఈటమాపురం పాఠశాలలో కోఆప్షన సభ్యుడు, టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి పుచ్చకాయల రవికుమార్‌, విద్యార్థులకు ప్లాస్టిక్‌ భూతం నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

Updated Date - Mar 15 , 2025 | 10:59 PM