AP NEWS: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్
ABN, Publish Date - Apr 06 , 2025 | 12:29 PM
Ahmed Basha Arrested: మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాషను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఆయన ఉన్నట్లు సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు.

కడప : కడప నగరంలో మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాష సృష్టించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అహ్మద్ భాష ఎన్నో అక్రమాలు, అరాచకాలకు తెగబడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అంజాద్ భాష, అతని తమ్ముడు అహ్మద్ భాషపై దృష్టి సారించింది. ఇవాళ(ఆదివారం) అహ్మద్ భాషను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబైలో కడప పోలీసు బృందం అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి దంపతులను, సీఎం చంద్రబాబును అసభ్యకరంగా అహ్మద్ భాష మాట్లాడాడు. గతంలో టీడీపీ నేత శ్రీనివాసుల రెడ్డిపై అహ్మద్ భాష పోలీస్టేషన్‌లోనే దాడి చేసేందుకు యత్నించాడు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు మేరకు అహ్మద్ భాషపై పోలీసులు కేసు నమోదు చేశారు. అహ్మద్ భాషపై మరో రెండు కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో అన్న మం త్రి అంజాద్ భాష అండచూసుకుని అహ్మద్ భాష కడపలో అరాచకాలు సృష్టించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అజ్ఞాతంలో అహ్మద్ భాష ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News
Updated Date - Apr 06 , 2025 | 12:35 PM