Share News

CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలు సీఎం కీలక సూచనలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:14 PM

CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలని... ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని.. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు.

CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలు సీఎం కీలక సూచనలు
CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 31: ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్ధులుగా బలపరిచామన్నారు. ఫిభ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుందని.. 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయని తెలిపారు. ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి భారీ మెజారిటీ సాధించాలని... చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని చెప్పారు.


ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దని నేతలకు సూచించారు. ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలని వెల్లడించారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలని... ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని.. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు.

బడ్జెట్‌‌పై రాష్ట్రపతి కీలక ప్రసంగం..


కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని.. ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదని... గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌, రాజధాని అమరావతికి ఆర్ధిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్‌తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని.. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు యువతకు వస్తాయని అన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు.


ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే ఇప్పుడూ అదేవిధంగా పని చేయాలని సూచనలు చేశారు. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్ధతు ఉందని ఈ సందర్భంగా అభ్యర్ధులు సీఎంకు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఎంతపని చేసిందంటే.. చివరకు కన్నతల్లిని కూడా

Supreme Court: సుప్రీంకు డాక్టర్ ప్రభావతి...హైకోర్టు ఉత్తుర్వులపై స్టే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 01:19 PM