రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించాలి
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:47 AM
పెద్దకడుబూరుకు రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించాలని సీపీఐ నాయకులు భాస్కర్ యాదవ్, సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు.

పెద్దకడుబూరు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): పెద్దకడుబూరుకు రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించాలని సీపీఐ నాయకులు భాస్కర్ యాదవ్, సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలా నికి రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారన్నారు. రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవ డంలే దన్నారు. ఉదయం 11గంటలైనా అధికారులు రాకపోవడంతో రైతులు, ప్రజలు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏఐవైఎఫ్ తాలుకా అధ ్యక్షుడు జాఫర్ పటేల్, ఏఐఎస్‌ఎఫ్ మండల కార్యదర్శి షేక్షావలి, వీరేష్, రవి, నాగరాజు, నరసింహులు పాల్గొన్నారు.