Share News

వైభవంగా శ్రీరామనవమి

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:12 AM

కర్నూలు నగరంలోని పాతబస్తీలోని రాంబొట్ల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీరామనవమి
వీకర్‌సెక్షన కాలనీలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరిత

సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని పాతబస్తీలోని రాంబొట్ల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, వార్డు టీడీపీ నాయకుడు శేషయ్య యాదవ్‌, ఈవో దినేష్‌ పాల్గొ న్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, వడపప్పు, పానకం అందజేశారు. నగరంలోని అశోక్‌నగర్‌లోని ప్రసన్న ఆంజనేయస్వామి, ద్వారకామాయి సాయిబాబా దేవస్థానంలో సీతారాముల కల్యాణం నిర్వ హించారు. శాస్త్ర పండితుడు ఇరివింటి కృష్ణమూర్తి కల్యాణ వేడుకలను ఆలయ అర్చకులు పుల్లయ్య చేత నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎం.లక్ష్మణ్‌గౌడ్‌, కె.రామిరెడ్డి, ఎస్‌. జయరాంప్రసాద్‌లు భక్తులకు తీర్థప్ర సాదాలు పంపిణీ చేశారు. సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రం, కొత్తపేటలోగల కోదండ రామస్వామి, బళ్లారి చౌరస్తాలోని హనుమాన ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్పీ ఆవరణలోని ఓంకారేశ్వరీ సహిత ఆంజనేయస్వామి, బళ్లారి చౌరస్తా సమీపంలోని నాగేంద్రనగర్‌లో వెలసిన సీతారామాంజనేయ ఆలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. పెద్ద పడఖానాలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి, ఎస్వీ విజయలక్ష్మి దంప తులు హాజరై పూజలు చేశారు. అదేవిధంగా నగరంలోని పలు ఆలయా ల్లో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌, చల్లా నాగరాజశర్మ పాల్గొన్నారు.

సీతారామాలయంలో మంత్రి టీజీ దంపతులు: నగరంలోని సంకల్‌ బాగ్‌లోని సీతారామాలయంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత, శిల్పా దంపతులు పూజలు ప్రారంభించారు. భక్తుల కోసం నిర్మించిన ఈ ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ, టీజీ రాజ్యలక్ష్మి దంపతులు కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత, టీజీ శిల్పా భరతలను ఆలయ పండితులు రాజేశశర్మ వేదాశీర్వా దాన్ని అందజేశారు. ఆలయంలో ప్రతిష్ఠిం చనున్న విగ్రహాలను టీజీ వెంకటేశ దంపతులు స్వయంగా తీసుకొని ఆలయంలోని ప్రవేశించి అర్చకునికి అందజేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుంచి 12 వరకు జరిగే విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఫ నగరంలోని దామోదరం సంజీవయ్య స్మారక నగరపాలక మున్సిపల్‌ హైస్కూల్‌ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకలకు ముఖ్య అతిథులుగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఏటా సీతారాముల కల్యాణోత్సవ సమితి కల్యాణం నిర్వహించడం అభినందనీయమన్నారు. సమితి ప్రతినిధులు మంత్రి టీజీ భరతను, ఎంపీ బస్తిపాటి నాగరాజు లను ఘనంగా సత్కరించారు. పీసపాటి మధుసూదనాచార్యుల బృందం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. భక్తులకు విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి అన్నప్రసాదం పంపిణీ చేశారు. రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య, స్రీతారాముల కల్యాణో త్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులు కె. క్రిష్టన్న పాల్గొన్నారు.

కల్లూరు: కల్లూరు అర్బన, రూరల్‌ మండలాల్లో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆదివారం 33, 28, 37వ వార్డు కల్లూరు, పందిపాడు, వీకర్‌సెక్షన కాలనీలో చేపట్టిన శ్రీరామనవమి వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరై పూజలు చేశారు. సీతారాముల కల్యాణంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి సమక్షంలో అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. కొగనపాడు, ఉలిందకొండ, చిన్నటేకూరు, వామసముద్రం, బస్తిపాడు, ఎర్రకత్వ, పుసు లూరు, గోవర్ధనగిరి గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, 37,41 టీడీపీ వార్డు ఇనచార్జిలు కృష్ణ వేణి, నాగేశ్వరరావు, జనార్దన ఆచారి, రాఘవేంద్రాచారి, అయ్యపు రెడ్డి, ఎనవీ రామకృష్ణ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, కన్నమ డకల, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, మీదివేముల, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, హుశేనా పురం, ఎన.కొంతలపాడు, కాల్వబుగ్గ, కొమ్ముచెరువు, కాల్వ, శకునాల, సోమయాజులపల్లె తదితర గ్రామాల్లో ఆదివారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వేదపండితులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఓర్వకల్లు చెన్నకేశవస్వామి ఆలయంలో ఈవో చంద్ర శేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి కుటుంబ సభ్యులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితుల చేత సీతారాముల కల్యాణం నిర్వహించారు. హుశేనాపురం గ్రామంలో సీతా రాముల కల్యాణాన్ని అర్చకులు రామ్మోహన శర్మ ఆధ ర్యంలో జరిగింది. స్వామి, అమ్మవార్ల విగ్రహాలను పల్లకిలో ఉంచి గ్రామ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో భక్తులు గోవిందరెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, కురువ పెద్దయ్య, జీకే సుధాకర్‌, కేవీ మధు, గొల్ల నాగరాజు, కాకి దేవేంద్ర, రామమద్దిలేటి, ఆకుల మహేష్‌, పుల్లారెడ్డి, పల్లెం తిరుపాలు పాల్గొన్నారు.

కర్నూలు న్యూసిటీ/ అర్బన: పాతబస్తిలోని చెన్నకేశవ ఆలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆదివారం వలసింగం రెడ్డి శ్రీనివాసులు, పాండు లక్ష్మీనారాయణ, రాముడు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు సహకారంతో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

కోడుమూరు: శ్రీరామ నవమిని పురస్కరించుకొని స్థానిక రాముల వారి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిం చారు. ఎస్‌ఎస్‌కే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పట్టణంలోని మహిళలు పాల్గొని సీతారాముల కల్యాణాన్ని కనులార వీక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జూతూరి రవి, శ్రీనివాసులు, నాగరాజు, బాబు, గోపి, వీరన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 01:12 AM