Share News

ఈకేవైసీ.. పరేషన్‌

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:24 AM

రేషన్‌ కార్డుల్లో సభ్యుల నమోదు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, లోపాల సవరణలకు ప్రతి సభ్యుడు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

ఈకేవైసీ.. పరేషన్‌
ఆలూరులో ఈకేవైసీ చేయించుకుంటున్న కార్డుదారులు

గడువు ఏప్రిల్‌ 30వరకు పొడిగింపు

రేషన్‌ కార్డుదారులు తప్పక వేలిముద్ర వేయాల్సిందే అంటున్న అధికారులు

ఆలూరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ కార్డుల్లో సభ్యుల నమోదు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, లోపాల సవరణలకు ప్రతి సభ్యుడు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈనెలాఖరు వరకు గడువు విధించగా ఇంకా 50 శాతానికి పైగా కార్డుదారులు ఈకెవైసీ వేయకపోవడంతో దీని గడువు ఏప్రిల్‌ 30 వరకు పొడిగించారు. రేషన్‌ కార్డుదారులు తప్పక ఈకేవైసీ చేయించాల్సి ఉంది. లేకుంటే సంబంధింత సభ్యుడి పేరు కార్డులో ఉండే అవకాశం లేదు. దీనివల్ల రేషన్‌, ఇతర లభ్ధికి దూరం అవుతారు.

ఎక్కడైనా చేయించుకోవచ్చు...

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ డీలరు వద్ద అయినా ఈకేవైసీ చేసుకోవచ్చు. డీలరుకు కార్డు సంఖ్య తెలియజేస్తే వేలిముద్ర వేయించుకుని, నమోదు చేస్తారు. అప్పడే వ్యక్తి కార్డులో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తింపు లభిస్తుంది. మీసేవా కేంద్రాలు, ఆధార్‌ కేంద్రాల్లో సైతం చేసుకునే వీలుంది. కార్డుల్లో ఉన్న చిన్నారులకు సంబంధించి ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్డేట్‌ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ జరిగిపోతుందని డీలరులు, అధికా రులు తెలిపారు. ప్రస్తుతం డీలర్లు అవగాహన కల్పిస్తు న్నారు. శాశ్వత వలస మరణాలు, కొత్తగా పుట్టిన వారి వివరాలు తెలుసుకుంటున్నారు.

ఇవీ ప్రయోజనాలు

రానున్న రోజుల్లో ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరు, కొత్త వ్యక్తులు, చిన్నారుల పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టబో తోంది. దీనివల్ల ప్రస్తుతం కార్డుల్లో ఉన్న సభ్యుల పేర్లు తప్పిపోకుండా ఉండేందుకు, రెండు చోట్ల నమోదై ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ప్రభుత్వ పథకాలను రేషన్‌ కార్డు ఆధారగానే అందజేస్తారు. వీటన్నిటికి ఈకేవైసీ నమోదు ఉపయోగపడుతుంది. జిల్లాలో మొత్తం 6,76,209 రేషన్‌ కార్డులు ఉండగా ఇప్పటికి 50 శాతం మాత్రమే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.

వేగవంతం చేయిస్తున్నాం

రేషన్‌ కార్డుల్లో ఉన్న ప్రతి సభ్యుడి ఈకేవైసీ చేసుకునేలా చర్యలు తీసుకుంటు న్నాం. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఈకేవైసీ జరిగేలా డీలర్‌లకు అవగాహన కల్పించి వేలిమ ద్రలు వేయిస్తున్నారు. ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. డీలర్లకు కూడా సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చాం. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పెంచింది. ఆలోగా పూర్తి చేస్తాం. -గోవింద్‌ సింగ్‌ తహసీల్దార్‌, ఆలూరు.

Updated Date - Apr 02 , 2025 | 12:25 AM