సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:20 AM
పట్టణంలోని ముగ్గురు వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జయసూర్య గురువారం అందజేశారు.

నందికొట్కూరు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ముగ్గురు వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జయసూర్య గురువారం అందజేశారు. పసుల శివప్రియకు రూ.1,41,662, పఠాన్ అబ్దుల్ హఫీజ్‌కు రూ.37,100, జయన్నకు రూ.36,600 చెక్కులను ఎమ్మెల్యే వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోనేందుకే సీఎం సహాయ నిఽధి ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ భాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల మున్సిపాలిటీ: నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో రూ.లక్ష విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ పంపిణీ చేశారు. అలాగే ఈ నెల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాను సద్విని యోగం చేసుకోవావాలని పార్టీ జాబ్ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇటీవల ప్రమాదంలో గాయ పడిన సీనియర్ మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్‌ను ఫిరోజ్ పరామర్శించారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జిల్ల్లెల్ల శ్రీరాములు, ఏవీఆర్ ప్రసాద్ ఉన్నారు.