Share News

ప్రభుత్వ కాలేజీల్లో చేరండి..!

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:27 AM

పదో తరగతి పరీక్షలు పూర్తయిన విద్యార్థుల వెంటపడి కళాశాలల్లో చేరాలంటూ ప్రైవేట్‌ విద్యా సంస్థలు పోటీపడటం సర్వసాధా రణం. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు పదో తరగతి విద్యార్థులు అవగా హన కల్పిస్తున్నారు.

ప్రభుత్వ కాలేజీల్లో చేరండి..!
విద్యార్థులతో మాట్లాడుతున్న అధ్యాపకులు

కరపత్రాలను పంపిణీ చేసిన అధ్యాపకులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు పూర్తయిన విద్యార్థుల వెంటపడి కళాశాలల్లో చేరాలంటూ ప్రైవేట్‌ విద్యా సంస్థలు పోటీపడటం సర్వసాధా రణం. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు పదో తరగతి విద్యార్థులు అవగా హన కల్పిస్తున్నారు. మంత్రాల యం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు మద్దిలేటి, జీవానందపాల్‌, అధ్యాపకులు రమేష్‌, ప్రభాకర్‌, వెంకటస్వామి తదితరులు మంగళవారం పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను కలిసి ప్రభుత్వ కాలేజీలోని వసతులు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు వంటి ఏర్పాట్లను వివరిస్తూ తమ కళాశాలలో చేరాలంటూ కోరారు.

Updated Date - Apr 02 , 2025 | 12:27 AM