Share News

వ్యవసాయాన్ని రక్షించుకునేందుకు పోరాటం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:30 AM

వ్యవసా యాన్ని రక్షించుకునేందుకు పోరాడాలని రైతు సంఘం గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. మంగళవారం పత్తికొండలో జీపుజాతను ప్రారంభించారు.

వ్యవసాయాన్ని రక్షించుకునేందుకు పోరాటం
పత్తికొండలో జీపుజాతను ప్రారంభిస్తున్న రామచంద్రయ్య

రైతు సంఘం గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య

పత్తికొండ టౌన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): వ్యవసా యాన్ని రక్షించుకునేందుకు పోరాడాలని రైతు సంఘం గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. మంగళవారం పత్తికొండలో జీపుజాతను ప్రారంభించారు. ఈ నెల 4న కర్నూలులో నిర్వహించనున్న రైతు సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఏటా అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టు బాటు ధరలు కల్పించడంతో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. నాయకులు రాజాసాహెబ్‌, సురేంద్ర కుమార్‌, కారన్న, సిద్దలింగప్ప, నాగిరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

ఆదోని రూరల్‌: పట్టణంలోని అంబ్కేదర్‌ నగర్‌ కూడలిలో కౌలు రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మయ్య మాట్లాడుతూ దేశంలో 60శాతం మది వ్యవసాయం మీదే ఆధారపడ్డారన్నారు. రాజు, అజయ్‌ బాబు, బసాపురం గోపాల్‌, నాగేంద్ర పాల్గొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి

దేవనకొండ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): దేవనకొండలో ఏఐకేఎస్‌ అధ్వర్యంలో జీపుజాతను రైతుసంఘం జిల్లా కార్యదర్శి నాగేంద్ర, సీపీఐ కార్యవర్గస భ్యుడు మద్దిలేటి శెట్టి ప్రారంభించారు. డాక్టర్‌ స్వామినాథన్‌ కమీటి సిఫార్సులను అమలు చేసి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలన్నారు. తిమ్మయ్య, నర్సారావ్‌, తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.

ఆస్పరి: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రయ్య తిమ్మయ్య కోరారు.

మద్దికెర: రుణాలను మాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజాసాబ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం బురుజుల, మద్దికెర, ఎం.అగ్రహారం, పెరవలి, బసినేపల్లి గ్రామాల్లో జీపుజాత నిర్వహించారు

Updated Date - Apr 02 , 2025 | 12:30 AM