IT Notice : రూ.1.83 కోట్లు చెల్లించాలని...లారీ డ్రైవర్‌కు ఐటీ నోటీసు!
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:16 AM
కోట్ల మేర చెల్లించాలంటూ ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చిందంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం

టెక్కలి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): లారీ డ్రైవర్‌గా పని చేసుకునే తనకు రూ.1.83 కోట్ల మేర చెల్లించాలంటూ ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చిందంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ చల్లపేటకు చెందిన చల్లా నాగేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఎకరా 30 సెంట్ల భూమి మాత్రమే ఉంది. ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు కట్టాలని నోటీసు రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి