బెదిరించి వాగ్మూలం తీసుకోవడం అవాస్తవం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:56 AM
పొన్నలూరు పీఎసీఎస్ సీఈవో మనోజ్‌కుమార్ ఫిర్యాదుకు సంబంఽ దించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటెండర్ షేక్ నవాజ్‌ను విచారించి స్టేట్‌మెంట్ తీసుకోవడం త ప్ప బెదిరించి వాగ్మూలం తీసుకోలేదని డీసీఏవో రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డీసీఏవో రాజశేఖర్
ఒంగోలు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పొన్నలూరు పీఎసీఎస్ సీఈవో మనోజ్‌కుమార్ ఫిర్యాదుకు సంబంఽ దించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటెండర్ షేక్ నవాజ్‌ను విచారించి స్టేట్‌మెంట్ తీసుకోవడం త ప్ప బెదిరించి వాగ్మూలం తీసుకోలేదని డీసీఏవో రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మోసం రాజా’ పేరుతో ఈనెల 10వ తేదీన ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంపై డీసీఏవో రాజశేఖర్ వివరణ ఇ చ్చారు. అటెండర్ నవాజ్ తనను బెదిరించినట్లు ఆరోపించడాన్ని ఖండించారు. పొన్నలూరు సొసైటీలో నిధులు దుర్వినియోగం అయినట్లు 2023-24 ఆడిట్ రిపోర్టు ఇచ్చిన ఆడిటర్ ఆ సంఘంపై సెక్షన్ 51 విచారణను కోరడంతో పైఅ ఽధికారులకు పంపామన్నారు. అది వారి పరిశీలనలో ఉందని, తమ కార్యాల యం నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కాగా మంత్రి డాక్టర్ డీఎస్ బీవీ.స్వామికి పొన్నలూరు సీఈవో ఇచ్చిన వినతిపత్రంను విచారణ కోసం కలె క్టర్‌కు పంపారని, అందులో కూడా డీసీఏవోపై ఆరోపణలు చేయలేదని వివరిం చారు. జిల్లా సహకారాధికారి కార్యాలయంలో పెండింగ్ ఉన్న సెక్షన్ 51 విచార ణకు సంబంధించి పొన్నలూరు సీఈవోపై పిటిషన్‌ను డీసీఏవో కార్యాలయం నుంచి తయారు చేశారనేది కూడా అవాస్తవంగా తెలిపారు. నవాజ్ ఆరో పిస్తున్న ఉద్యోగి కూడా డీసీవో కార్యాలయంలో గుమస్తాగా వివరించారు.