Share News

నేడు, రేపు మంత్రి స్వామి డెహ్రాడూన్‌ పర్యటన

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:23 PM

జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సోమ, మంగళవారాల్లో ఉత్తారాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో పర్యటించనున్నారు.

నేడు, రేపు మంత్రి స్వామి   డెహ్రాడూన్‌ పర్యటన

కేంద్రం నిర్వహించే చింతన్‌ శివిర్‌ సమావేశానికి హాజరు

ఒంగోలు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సోమ, మంగళవారాల్లో ఉత్తారాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ రెండు రోజులపాటు నిర్వహిస్తున్న చింతన్‌ శివిర్‌ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు, వివిధ రాష్ట్రాల్లో వాటి అమలు తీరును సమీక్షించేందుకు కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఇందులో ఆయా వర్గాల అభ్యున్నతితోపాటు సామాజిక న్యాయ అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి నరేంద్రకుమార్‌, ఉపమంత్రులు రాందాస్‌ అధివాలే, బీఎల్‌ వెర్మాలు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంక్షేమశాఖ మంత్రులు హాజరుకానున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి డాక్టర్‌ స్వామి పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. వాటి అమలుకు అవసరమైన నిధులను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.

Updated Date - Apr 06 , 2025 | 11:23 PM