Share News

వైభవంగా ఉగాది

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:53 AM

తెలుగు సంవత్సరాది ఉగాదిని జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. వేకువజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఊరూరా పంచాంగ శ్రవణాలు జరిగాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి రాశి ఫలాల గురించి ఆసక్తిగా విన్నారు.

వైభవంగా ఉగాది
ఒంగోలులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం చేస్తున్న మఠంపల్లి దక్షిణామూర్తి, పక్కన మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు బీఎన్‌, ఉగ్ర, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు

ఊరూరా పంచాంగ శ్రవణాలు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

‘విశ్వావసు’లో సర్వతోముఖాభివృద్ధి

మంత్రి డాక్టర్‌ స్వామి

తెలుగు సంవత్సరాది ఉగాదిని జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. వేకువజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఊరూరా పంచాంగ శ్రవణాలు జరిగాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి రాశి ఫలాల గురించి ఆసక్తిగా విన్నారు. ఒంగోలులో ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా కొండపి మండలం జాళ్లపాలెంలోని వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల ఘనంగా జరిగింది. ఐదు విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేశారు. వాటిపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి నాంది పలకాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి ఆకాంక్షించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాలులో జరిగిన శ్రీవిశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా వేదపండి తులు మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ ఈ విశ్వావసులో అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం, అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా, వర్షాలు సమృద్ధిగా సకాలంలో కురిసేలా ఉండటం సంతోషకర మన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ సుఖసంతోషాలతో మేలు జరగాలని ఆకాంక్షించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజలందరూ ఈ సంవత్సరం సంతోషంగా జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఆర్‌.గోపాలకృష్ణ, మేయర్‌ గంగాడ సుజాత, మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ కుమార్‌, ఏపీ పర్యాటక సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ నూక సాని బాలాజీ, డీఆర్వో చినఓబులేషు, ఆర్డీవోలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్థనరెడ్డి, వివిధ శాఖల అధికారులు చిరంజీవి, కిరణ్‌కుమార్‌, అర్జున్‌నాయక్‌, వెంకటనాయుడు, లక్ష్మానాయక్‌ , జనార్దన్‌రెడ్డి, హేనసుజన, సుశీల, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 01:53 AM