Share News

విదేశీ విద్యార్థులపై ఆరా!

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:26 AM

విదేశీలు ఎంతమంది ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు? వాస్తవంగా వాళ్లంతా ఇక్కడ ఉన్నారా? ఒకవేళ ఉంటే ఏ చిరునామాలో ఉంటున్నారు? అంటే సమాధానం దొరకడం ప్రస్తుతం చాలా కష్టంగానే మారింది. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ రికార్డులను అప్‌డేట్‌ చేయకుండా వదిలేశారు. ఫలితంగా ఇప్పుడు పోలీస్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విదేశీ విద్యార్థులు ఎంతమంది విద్యాభ్యాసం చేస్తున్నారో లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఆ విద్యార్థులంతా ఎక్కడున్నారంటే మాత్రం నాలుగు దిక్కులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విదేశీ విద్యార్థులపై ఆరా!

ఐదేళ్లుగా అప్‌డేట్‌ కాని రికార్డులు

ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఎస్‌బీ

విజయవాడలో 148 మంది ఉన్నట్టు లెక్కలు

వారెక్కడున్నారో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు

విదేశీలు ఎంతమంది ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు? వాస్తవంగా వాళ్లంతా ఇక్కడ ఉన్నారా? ఒకవేళ ఉంటే ఏ చిరునామాలో ఉంటున్నారు? అంటే సమాధానం దొరకడం ప్రస్తుతం చాలా కష్టంగానే మారింది. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ రికార్డులను అప్‌డేట్‌ చేయకుండా వదిలేశారు. ఫలితంగా ఇప్పుడు పోలీస్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విదేశీ విద్యార్థులు ఎంతమంది విద్యాభ్యాసం చేస్తున్నారో లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఆ విద్యార్థులంతా ఎక్కడున్నారంటే మాత్రం నాలుగు దిక్కులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఐదేళ్ల కాలంలో అనాథలుగా వదిలేసిన విదేశీయుల రికార్డులను అప్‌డేట్‌ చేసే పనిలో స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఉన్నారు. వివిధ దేశాల నుంచి విజయవాడకు ప్రతినిధులు వస్తుంటారు. వివిధ ప్రాజెక్టులపై వచ్చే వారు కొంతమంది ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే వారు మరికొంతమంది ఉంటారు. ఈ రెండు కాకుండా పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి కొంతమంది వస్తుంటారు. ఈ మూడు కేటగిరీలో కంటే మొదటి రెండు కేటగిరీల్లో వచ్చే విదేశీలుయులు ఎక్కువగా ఉంటారు.

సమాచార సేకరణ ఏది?

విజయవాడకు చుట్టుపక్కల ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆఫ్రికా దేశాల నుంచి విద్యార్థులు ఎడ్యుకేషన్‌ వీసాపై వస్తుంటారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న నోవా, నిమ్రా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటారు. ఇవి కాకుండా గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్‌యూలో మరికొంతమంది వివిధ కోర్సుల్లో చేరతారు. ఇలా విద్యాసంస్థల్లో చేరిన వాళ్లంతా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలోని స్పెషల్‌ బ్రాంచ్‌లో ఐవీఎఫ్‌ఆర్టీ (ఇమిగ్రేషన్‌ వీసా ఫారినర్స్‌ రిజిసే్ట్రషన్‌ అండ్‌ ట్రాకింగ్‌) విభాగంలో రిజిసే్ట్రషన్‌ చేయించుకోవాలి. వారు ఏ విద్యాసంస్థలో చదువుతున్నారు, ఏ గ్రూపులో అడ్మిషన్‌ తీసుకున్నారు, వసతి ఎక్కడ తీసుకున్నారు అన్న వివరాలను ఈ ఐవీఎఫ్‌ఆర్టీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిజిసే్ట్రషన్‌ పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులపై స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది నిఘా ఉంచుతారు. వారి కదలికలను గమనిస్తుంటారు. ఈ విద్యార్థులు కాకుండా వివిధ ప్రాజెక్టుల పనులపై కొంతమంది విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు. వాళ్లంతా స్టార్‌ హోటళ్లలో బ చేస్తారు. వారికి సంబంధించిన వివరాలను ఐవీఎఫ్‌ఆర్టీ సిబ్బంది సేకరిస్తారు. వారు హోటళ్లలో దిగింది మొదలు తిరిగి విమానం ఎక్కే వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ఉన్నతాధికారులకు పంపుతారు. హోటళ్లలో దిగిన తర్వాత రిసెప్షన్‌లో ఫారం ‘సీ’ని విదేశీయులకు ఇస్తారు. దాన్ని వారు పూర్తిచేసి తిరిగి రిసెప్షన్‌లో ఇస్తారు. ఆ ఫారంను హోటల్‌ సిబ్బంది స్పెషల్‌ బ్రాంచ్‌కు పంపుతారు. దీన్నీ అప్పటి అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

148 మంది వరకు ఉన్నారని లెక్కలు!

విదేశాల నుంచి ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులు కమిషనరేట్‌ పరిధిలో 148 మంది వరకు ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. వారు ఎక్కడున్నారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విదేశీ విద్యార్థులు కొంతమంది వాటికి సంబంధించిన హాస్టళ్లలో ఉంటారు. మరికొంతమంది బయట బ్యాచిలర్‌ రూంల్లో ఉంటారు. విద్యాభ్యాసం పూర్తయి సొంత దేశాలకు వెళ్లినా, ఇక్కడి నుంచి మరో రాషా్ట్రనికి వెళ్లినా కచ్చితంగా ఐవీఎఫ్‌ఆర్టీలో సమాచారం ఇవ్వాలి. ఆ విద్యార్థులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారు ఇచ్చిన చిరునామాలను సిబ్బంది నిరంతరం పరిశీలిస్తుండాలి. ఒకవేళ ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారితే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. వైసీపీ పాలన సాగిన ఐదేళ్లలో ఈ ప్రక్రియను పడుకోబెట్టేశారు. విదేశీ విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించకుండా వదిలేశారు. రికార్డుల ప్రకారం ఉన్న 148 మందిలో కొంతమంది మాత్రమే కమిషనరేట్‌ పరిధిలో ఉన్నట్టు తేలింది. మిగిలిన వారి చిరునామాలు తెలియడం లేదు. వాళ్లంతా సొంత దేశాలకు వెళ్లిపోయారా, విజయవాడ నుంచి మరో రాషా్ట్రనికి వెళ్లిపోయారా అన్న వివరాలు మాత్రం తేలడం లేదు. దీనితో ప్రస్తుతంవ ఐవీఎఫ్‌ఆర్టీ సిబ్బంది ఆ వివరాలు తెలియకపోవడంతో తలలు పట్టుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తేల్చే పనిలో పడ్డారు. నాడు వైసీపీ హయాంలో అధికారులు వదిలేసిన రికార్డులను అప్‌డేట్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:26 AM