Andhra Pradesh IT Policy: ఐటీ ప్రమోషన్ బాధ్యత ఈడీబీదే
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:38 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పాలసీని రాష్ట్ర ఐటీ శాఖ ప్రవేశపెట్టింది. ఇన్నోవేషన్-స్టార్ట్‌ప 2024-29 పేరుతో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందంటూ ప్రమోషన్ చేసే బాధ్యతను ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డు(ఈడీబీ)కు అప్పగిస్తూ ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈడీబీ ఆకర్షించి తెచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా భూములు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చే బాధ్యతను ఏపీఐఐసీ తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వశాఖల మధ్య ‘వర్క్ డివిజన్’ను స్పష్టం చేస్తూ సోమవారం ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులిచ్చారు. ఇక, అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ‘ఇన్నోవేషన్-స్టార్ట్‌ప 2024-29’ పాలసీని రాష్ట్ర ఐటీ శాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు కాటంనేని భాస్కర్ పాలసీ వివరాలతో ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పాలసీలో విశాఖ ఆంరఽధా వర్సిటీలో ఐవోటీ అండ్ ఏఐ, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో రూరల్ ఇన్నోవేషన్ సెంటర్, కాకినాడ కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్సులో మారిటైం అండ్ షిప్పింగ్, విశాఖపట్నం కల్పలేరు, ఎస్టీపీఐలో ఇండస్ర్టీ 4.ఓ, విశాఖపట్నం ఎయిమ్స్‌లో మెడికల్ డివైజెస్ స్టార్టప్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు.