నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:46 PM
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన మల్లప్పగేటు నుంచి కర్నూలు జిల్లా నంచర్ల మద్య రైల్ ఓవర్ రైల్ (ఆర్‌వోఆర్) డబుల్ లైన రైలు మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది.

భూసేకరణకు శ్రీకారం చుట్టిన రైల్వేశాఖ
కర్నూలు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన మల్లప్పగేటు నుంచి కర్నూలు జిల్లా నంచర్ల మద్య రైల్ ఓవర్ రైల్ (ఆర్‌వోఆర్) డబుల్ లైన రైలు మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. అవసరమైన భూసేకరణ కోసం గతంలోనే నోటిఫికేషన జారీ చేయగా.. పలు అభ్యంతరాలు తలెత్తాయి. ఆ అభ్యంతరాలను సరి చేసి రైల్వే నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన జారీ చేసింది. గుంతకల్లు రైల్వే జంక్షన మల్లప్ప గేటు నుంచి జిల్లాలోని మండల కేంద్రం చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వోఆర్ డబుల్ లైన నిర్మాణం చేపట్టనున్నారు. ఇందు కోసం చిప్పగిరి గ్రామంలో 27 మంది రైతుల నుంచి 26.67 ఎకరాలు, దౌలతాపురంలో 21 మంది రైతుల నుంచి 8.08 ఎకరాలు, నంచర్ల గ్రామంలో ఒక రైతు నుంచి 0.10 ఎకరాలు కలిపి 34.65 ఎకరాల భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్డీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.