Share News

Registration Services: 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:04 AM

రాష్ట్రంలోని 26 జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, అవినీతి నివారణే లక్ష్యంగా ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు.

Registration Services: 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌

స్లాట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని

26 జిల్లా ప్రధాన రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులోకి

స్లాట్‌ లేకపోతే... సాయంత్ర 5 గంటలు తరువాతే అవకాశం

2 నెలల్లో రాజముద్రతో రైతుకు పాసు పుస్తకాలు: సత్యప్రసాద్‌

ఫేస్‌, పేపర్‌, క్యాష్‌ లెస్‌ రిజిస్ట్రేషన్లే లక్ష్యం: సిసోడియా

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ సేవలను శుక్రవారం సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రారంభించారు. స్లాట్‌ బుకింగ్‌ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్‌ను ఆవిష్కరించారు. ‘ప్రజలకు సౌకర్యవంతంగా, సులభతరంగా సేవలు అందించాలనే సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించాం. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఇందుకోసం ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశాం. దీంతో వినియోగదారులు తమకు వీలు న్న రోజు, వీలైన సమయాన్ని ఎంచుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. ఈరోజు నుంచి మొత్తం 26 జిల్లా ప్ర ధాన రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మొత్తం 296 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ పద్ధతి దశలవారీగా అమలులోకి వస్తుంది. ఇప్పటికే గాంధీనగర్‌, కంకిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశాం. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. డాక్యుమెంటు తయారు చేసుకోవడం, దానిని అప్‌లోడ్‌ చేసుకోవడం, తప్పులు ఉంటే వెరిఫై చేసుకోవడం, చలానా కట్టడం... అన్నీ స్వయంగా ఆన్‌లైన్‌లో వినియోగదారుడే చేసుకోవచ్చు. పై పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత స్లాట్‌ బుక్‌ చేసుకుంటే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకోలేక పోయున వారు సాయంత్రం 5 గంటల తరువాత నేరుగా కార్యాలయానికి వస్తే రిజిస్ట్రేష న్‌ చేస్తాం. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక ఫీజు రూ.5,000 తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేస్తాం.


ఉగాది, రంజాన్‌ పండుగల సందర్భంగా 3 రోజులు సెలవులు వచ్చాయి. ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.74 కోట్లు ఆదాయం వచ్చిం ది. ఆటోమ్యూటేషన్‌ను సులభతరం చేయడానికి రిజిస్ట్రేష న్‌ సాఫ్ట్‌వేర్‌ను రెవెన్యూ డేటాబే్‌సతో అనుసంధానం చే శాం. పురపాలక, పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) తదితర శాఖలతోనూ అనుసంధానం ప్రారంభించాం. ఈ ప్రక్రియ 2025, ఏప్రిల్‌ 15 నాటికి పూర్తవుతుంది. దీంతో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్ల సృష్టి లాంటి రియల్‌ ఎ స్టేట్‌ మోసాలను నివారించేందుకు వీలవుతుంది. అభివృద్ధి కి ఆటంకంగా, భూ యజమానులకు ఇబ్బందిగా ఉన్న నా లా చట్టాన్ని రద్దు చేస్తున్నాం. 2024-25 ఏడాదికి రిజిస్ట్రేష న్‌ ఆదాయం తగ్గిందని జగన్‌ అవినీతి పత్రిక వార్తలు రాసింది. డబ్బు కోసం గడ్డితినే ప్రభుత్వం మాది కాదు. రెండు నెలల్లో రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తాం’ అని మంత్రి అనగాని చెప్పారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా మాట్లాడుతూ... ‘రిజిస్ట్రేషన్ల శాఖలో వరుసగా తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా అవినీతి తగ్గి, పారదర్శకత పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఫేస్‌ లెస్‌, పేపర్‌ లెస్‌, క్యాష్‌ లెస్‌గా రిజిస్ట్రేషన్లు జరపాలనేది మా లక్ష్యం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:04 AM