Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..
ABN , Publish Date - Apr 15 , 2025 | 09:53 PM
ఓ వ్యక్తి తన ఇంటి బాత్‌రూంలో బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేయాలని అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా వివిధ రకాల లిక్విడ్లతో శుభ్రం చేయడం చూస్తుంటాం. అయితే ఇతను మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు.

కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరికి ఎవరికీ రాని విధంగా ఏవేవో ఐడియాలు వస్తుంటాయి. వాటన్నింటినీ వీడియోలుగా మార్చి, సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఓ వ్యక్తి బాత్‌రూం క్లీనింగ్ చేసే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి బాత్‌రూంలో బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేయాలని అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా వివిధ రకాల లిక్విడ్లతో శుభ్రం చేయడం చూస్తుంటాం. అయితే ఇతను మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు.
లిక్విడ్లతో బ్యాక్టీరియా చనిపోదు అనుకున్నాడో ఏమో గానీ.. చివరకు వినూత్నంగా ఆలోచించాడు. తన మరుగుదొడ్డిలోని ఇండియన్ టాయిలెట్‌లో క్లీనింగ్ లిక్విడ్‌కు బదులుగా పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత అగ్గిపుల్ల వెలిగించి (Man pours petrol in bathroom and sets it on fire) అందులో వేసేశాడు. అగ్గి పుల్ల వేయగానే మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా టాయిలెట్ మొత్తం మంటలతో నిండిపోయింది.
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుందనేది అతడి ఉద్దేశం. ఇతడి విచిత్ర ఆలోచన చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘‘బాత్రూంను ఇలాక్కూడా క్లీనింగ్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Jugad Viral Video: సీలింగ్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్.. ప్రయోగం చూశారంటే నోరెళ్లబెట్టాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..