Share News

Nara Bhuvaneshwari: సామాజిక న్యాయం టీడీపీకే సాధ్యం

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:56 AM

కుప్పం లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న నారా భువనేశ్వరి సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా పేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి, మహిళా శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించారు.

Nara Bhuvaneshwari: సామాజిక న్యాయం టీడీపీకే సాధ్యం

కుప్పంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నారా భువనేశ్వరి వ్యాఖ్య

కుప్పం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లో ఆమె 4 రోజుల పర్యటన శనివారం ముగిసింది. శనివారం కుప్పంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం లో ఆమె పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా పేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. షాహీ గార్మెంట్స్‌లో మహిళా కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబు సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రభుత్వపరంగా, రాజకీయ నాయకుడిగా ఆయన సాధిస్తున్న విజయాలకు కార్యకర్తల అండదండలే కారణమన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి దాకా 7,531 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు 2500 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కుప్పం లో 150 మంది మహిళలకు టైలరింగ్‌, జ్యూట్‌ బ్యాగ్‌ తయారీ, సిల్క్‌ దారాలతో గాజుల తయారీ, చికన్‌కారీ ఎంబ్రాయిడరీ తదితర శిక్షణ ఇస్తున్న ట్లు తెలిపారు. స్త్రీ శక్తి విభాగం ఏర్పా టు చేసి స్వయం ఉపాధి శిక్షణ ద్వారా సాధికారత కల్పిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 04:56 AM