Cucumber Diet Mistakes: వేసవిలో దోసకాయను ఈ పదార్థాలతో కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు..
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:34 PM
Cucumber Food Combnations To Avoid: మండే ఎండలకు దాహం తీరక నీరు అధికంగా ఉండే కీర దోసకాయ రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుంటారు ఎంతోమంది. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు అందించే దోసకాయను కొన్ని పదార్థాలో కలిపి తింటే మాత్రం హానికరంగా మారుతుంది.

What Not Eat With Cucumbers : అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే దోసకాయ తాజా రుచి అంటే ఎవరికైనా ఇష్టమే. ముఖ్యంగా వేసవికాలంలో నీరు సమృద్ధిగా ఉండే దోసకాయ శరీరానికి చలువ చేసి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకని ప్రజలు దోసకాయను ప్రతిరోజూ వివిధ రకాల పదార్థాలతో కలిపి తింటూ ఉంటారు. దోసకాయను ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకుంటారు. కొన్నిసార్లు రైతాగా, శాండ్‌విచ్ ఫిల్లింగ్‌గా, అనేక ఇతర మార్గాల్లో ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు దోసకాయను తప్పుడు వస్తువులతో తిన్నప్పుడు ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఈ 5 రకాల పదార్థాలతో కలపి దోసకాయను తింటున్నారేమో పరిశీలించుకోండి. ఈ వేసవిలో దోసకాయలను వేటితో పాటు తినకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
దోసకాయ, టమోటా
చాలా మంది దోసకాయ, టమోటాలను కలిపి సలాడ్ లాగా తింటారు. ఇవి మీకు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలుగా అనిపించినప్పటికీ.. వాస్తవానికి అవి మీ ఆరోగ్యానికి మాత్రమే హాని కలిగిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపులో తీవ్రమైన గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. నిజానికి, ఈ రెండింటి కలయిక మీ కడుపు pH సమతుల్యతను పాడుచేస్తుంది. ఇదే కాకుండా టమోటా, దోసకాయ రుచులు కలిపి తిన్నప్పుడు నోటికి రుచికరంగా కూడా ఉండదు. ఈ కారణంగా మీకు సలాడ్ తినడం కొంచెం బోరింగ్‌గా అనిపించవచ్చు.
దోసకాయతో ముల్లంగి
సలాడ్‌లో దోసకాయ, ముల్లంగిని జత చేయడం కామన్. ఇది చాలామందికి నచ్చుతుంది కూడా. అయితే, ఈ ఆహార కలయిక ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. రెండింటిలో నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. అందుకే వాటి ప్రభావం శరీరాన్ని మరింత చల్లబరుస్తుంది. అంతేకాకుండా, వీటిని కలిపి తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి కడుపు సమస్యలు కూడా వస్తాయి. ఇది మాత్రమే కాదు.. రెండూ కలిసి తింట శరీరం విటమిన్ సిని సరిగ్గా గ్రహించలేదు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సిట్రస్ పండ్లతో దోసకాయ
చాలా మంది దోసకాయపై నిమ్మకాయ వేసుకుని తింటారు. కొన్నిసార్లు దోసకాయను పండ్ల చాట్ లోనే నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లతో కలుపుతారు. అయితే ఈ ఆహార కలయిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీనితో పాటు వాటి పుల్లని రుచి దోసకాయ రుచిని పాడు చేస్తుంది. ఇది దోసకాయను తడిగా చేస్తుంది. అలాంటప్పుడు మీరు దోసకాయ అసలైన రుచిని ఆస్వాదించలేరు.
మాంసంతో దోసకాయ
మాంసంతో దోసకాయ తినడం ఏ మాత్రం మంచిది కాదు. నిజానికి ఈ రెండు ఆహారాల్లోని పోషకాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. దోసకాయ సులభంగా జీర్ణమైతే.. మాంసం జీర్ణం కావడానికి 8 గంటల వరకు పట్టవచ్చు. దీనితో పాటు దోసకాయలో ఫైబర్, నీరు పుష్కలంగా ఉంటాయి. అదే మాంసంలో అధిక ప్రోటీన్, కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఈ వైరుధ్యం కారణంగా మాంసం, దోసకాయలను కలిపి తినడం వల్ల ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
Read Also: Fast Weight Loss Tips: ఎంత ట్రై చేసిన బరువు తగ్గలేకపోతున్నారా.. ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్..
Diabetes Solutions: షుగర్ కంట్రోల్ కోసం.. రాందేవ్ బాబా చెప్పిన 5 చిట్కాలు..
Mango Juice: మ్యాంగో జ్యూస్ తాగుతున్నారా.. ఈ 7