Share News

రాఘవరాయడికి విశేష పుష్పాలంకరణ

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:55 PM

వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణతో పాటు విశేష పుష్పాంకరణ సేవ చేశారు.

రాఘవరాయడికి విశేష పుష్పాలంకరణ
శ్రీమఠం ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు

మంత్రాలయం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణతో పాటు విశేష పుష్పాంకరణ సేవ చేశారు. సోమవారం శుభదినాన్ని పురస్కరించుకొని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో పండితులు బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, తులసి అర్చన, విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. బంగారు, వెండి, పట్టు వస్ర్తాలు, బెంగుళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలు, బంగారు కవచంతో చూడ ముచ్చటగా అలంకరించారు. పీఠాధిపతి పూజలు, చేసి మంగళహారతులు ఇచ్చారు.

ఫమంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం శ్రీశైలం నుంచి వచ్చిన కర్ణాటక భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు శ్రీమఠం పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది.

ఫ వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హర్షధ్వనుల మధ్య మూలరాములకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అభిషేకం చేశారు. సోమవారం విధియ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పూర్ణబోధ పూజామందిరంలో వెండి మంటపంలో మూలరాములు, జయరాములు, దిగ్విజయరాములకు అభిషేకం చేశారు. క్షీరాభిషేకం, తులసి అర్చన, పుష్పాభిషేకం, స్వర్ణ నాణేలతో అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు పాదపూజ చేసి బంగారు, నవరత్నాల రథాలపై స్వామివారు ఊరేగింపు నిర్వహించారు.కార్యక్రమంలో పండిత కేసరి రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, మేనేజర్లు శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్‌ కోణాపూర్‌, సూపర్నిండెంట్‌లు రవి కులకర్ణి, అనంత పురాణిక్‌, విజయేంద్ర ఆచార్‌, జయతీర్థ ఆచార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:55 PM