Share News

Minister Atchannaidu: వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Feb 28 , 2025 | 11:42 AM

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయినికి 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Minister Atchannaidu: వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న
Minister Atchannaidu

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennadu) వ్యవసాయ బడ్జెట్‌‌(Agricultural budget)ను ప్రవేశపెట్టారు. రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని అన్నారు. వికసిత్‌ భారత్‌కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి చెందుతోందన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని, 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి..

రైతులకు ప్రభుత్వం శుభవార్త...


అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయినికి 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రోత్‌ ఇంజిన్లుగా 11 పంటలని.. ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు కేటియించినట్లు చెప్పారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహానికి రూ.61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.


డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు కేటాయించామని, 875 కిసాన్‌ డ్రోన్‌ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..

వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..

ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 28 , 2025 | 11:47 AM

News Hub