కమనీయం...మల్లన్న రథోత్సవం
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:16 AM
శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఆదివారం దేవదేవుని రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణల మధ్య ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, రథోత్సవం భక్తులను ఆకట్టుకుంది.

శ్రీశైలానికి తరలివచ్చిన అశేష భక్తజనం
శ్రీశైౖలం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో ఆదివారం దేవదేవుని రథోత్సవం వైభవంగా సాగింది. సాయంత్రం రథశాల వద్ద ఆలయ అర్చకులు రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి ఉభయ దేవాలయ ప్రాంగణంలో విశేష అర్చనలు, హారతులందుకున్న స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకొచ్చారు. పుష్పాలతో అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేశారు. గంగాధర మండపం నుంచి నంది మండపం దాకా, అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు రథోత్సవం సాగింది. రథంపై ఆదిదేవులు ఆశీనులై ముందుకు సాగుతుండగా భక్తుల శివ నామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగింది. కాగా, ఆదివారం రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News