DGP Harish Kumar Gupta: రేపిస్టులకు కఠిన శిక్షలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:41 AM
చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని, యావజ్జీవ శిక్షలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం 164 శక్తి బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బాధితులకు న్యాయం కోసం ‘శక్తి’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

మహిళలు, చిన్నారులకు రక్షణగా 164 శక్తి బృందాలు: డీజీపీ
ఐదు జిల్లాల్లో తీర్పులపై పోలీసులకు అభినందన
అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తామని, యావజ్జీవ శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం పోలీసు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పోక్సో కేసుల్లో ఇటీవల శిక్షలు ఎక్కువగా పడుతుండటాన్ని డీజీపీ ప్రస్తావించారు. విజయనగరం, చిత్తూరు, తిరుపతి, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఐదుగురికి కోర్టులు జైలు శిక్ష విధించడంపై ఆయా జిల్లాల పోలీసుల్ని అభినందించారు. శిక్షల శాతం పెరిగితేనే నేరస్తుల్లో భయం పెరిగి అఘాయిత్యాలు తగ్గుతాయని, బాధితులకు కూడా స్వాంతన లభిస్తుందని పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించి బాధ్యులకు శిక్షలు పడేలా ఏపీపీలతో సమన్వయం చేసుకోవాలని క్షేత్రస్థాయి పోలీసులకు డీజీపీ సూచించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో 164 శక్తి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆడవారికి నిరంతరం రక్షణ కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ పని చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఫోన్‌లో ‘శక్తి’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News