BC Welfare: బీసీలకు టీడీపీ రక్షణ కవచం
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:21 AM
బీసీల అభివృద్ధికి టీడీపీ నిరంతరం కృషి చేస్తోంది. విజయవాడలో జరిగిన యాదవ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు తదితరులు టీడీపీ పాలనలో బీసీలకు జరిగిన మేలు గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలను మోసం చేశారని ఆరోపణలు చేశారు.

బలహీన వర్గాలను ఊచకోత కోసిన వైఎ్‌సఆర్, జగన్
యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో మంత్రులు
విజయవాడ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ‘బీసీలకు టీడీపీ రక్షణ కవచంగా ఉంది. ఆ వర్గాలకు గుర్తింపు తెచ్చింది నాడు ఎన్టీ రామారావు అయితే... ప్రస్తుతం సీఎం చంద్రబాబు అన్ని రంగాల్లో ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు’ అని పలువురు మంత్రులు పేర్కొన్నారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా జి.నరసింహ యాదవ్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, రామ్ ప్రసాద్ రెడ్డి, పార్థసారథి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ... ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలహీనవర్గాలను ఊచకోత కోశారు. జగన్ 56 కార్పొరేషను పెట్టి పైసా కేటాయించకుండా బీసీలను మోసం చేశారు’ అని అన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ... ‘వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దాడులు, హత్యలు జరిగాయి. సీఎం చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో 8 మంది బీసీ మంత్రులు ఉన్నారు’ అని తెలిపారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.నరసింహ యాదవ్ మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆర్టీసీ చైర్మన్, కొనకళ్ల నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డి.రామారావు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో చైర్మన్ నరసింహ యాదవ్‌ను ఘనంగా సత్కరించారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..