Share News

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:18 PM

47 మార్కెట్ కమిటీలకు సంబంధించి టీడీపీ ఛైర్మన్లను ప్రకటించింది. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయనుంది. 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర
Nominated Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ శుక్రవారం ఛైర్మన్లను ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు గానూ.. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయనుంది. ఇక, అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేయనుంది. ప్రకటించిన 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. టీడీపీ త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనుంది.


టీడీపీ గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మహానాడు కంతా అన్ని పదవులు భర్తీ చేయాలని తెలుగు దేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకంగా 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తొలి జాబితాలో 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో మొత్తం 59 మందికి అవకాశం కల్పించారు.


ఇవి కూడా చదవండి:

ఇది జవాన్ స్టైల్ కుకింగ్

Earthquake In Myanmar: మయన్మార్‌లో భూకంపం.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్.. ఆరుగురు వ్యక్తులు నన్ను వేధించారు

Updated Date - Mar 28 , 2025 | 02:35 PM