Share News

BREAKING NEWS: హెచ్‌సీయూలో ప్రమాదం..

ABN , First Publish Date - Feb 27 , 2025 | 11:27 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

BREAKING NEWS: హెచ్‌సీయూలో ప్రమాదం..
Breaking News

Live News & Update

  • 2025-02-27T21:12:25+05:30

    హెచ్‌సీయూలో ప్రమాదం..

    • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రమాదం.

    • కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.

    • శిథిలాల కింద ఒక కార్మికుడు చిక్కుకున్నట్లు అనుమానం.

  • 2025-02-27T16:23:39+05:30

    తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

    • ఏపీలో 3, తెలంగాణలో 3 MLC స్థానాలకు పోలింగ్‌

    • మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • 2025-02-27T13:48:42+05:30

    పోలింగ్ కేంద్రాల వద్ద నోట్ల పంపిణీ

    • ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ

    • తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానంలో డబ్బుల పంపిణీ ఆరోపణలు

    • పిఠాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఓటర్లకు డబ్బులు ఇచ్చారంటూ ఆరోపణలు

    • ఒక ఓటుకు రూ.3వేలు పంపిణీ

    • నోట్ల పంపిణీతో తమకు సంబంధం లేదంటున్న కూటమి నేతలు

    • ఎవరో పంపిణీ చేస్తే, తమకు ఏమి సంబంధం అంటున్న కూటమి నేతలు

  • 2025-02-27T12:40:16+05:30

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం

    • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పార్వతీపురం మన్యం జిల్లాలో కి 60.65 శాతం పోలింగ్ నమోదు

  • 2025-02-27T12:38:52+05:30

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం

    • ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక

    • ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

    • సూర్యాపేట జిల్లాలో 45.53 శాతం ఓటింగ్ నమోదు

    • యాదాద్రి-భువనగిరి జిల్లాలో 48.58శాతం ఓటింగ్ నమోదు

  • 2025-02-27T12:36:46+05:30

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం

    • ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 54.34 శాతం ఓటింగ్ నమోదు

    • ఓటు హక్కు వినియోగించుకున్న 1393 మంది పురుషులు, 829 మంది మహిళలు

    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

    • 46.44 శాతం నమోదు

  • 2025-02-27T12:36:45+05:30

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం

    • నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల స్థానానికి 27.44 శాతం పోలింగ్

    • నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల స్థానానికి 42.12 శాతం పోలింగ్

  • 2025-02-27T11:58:57+05:30

    సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

    • సీఎం రేవంత్ రెడ్డి మోడీని కలిసి అంతులేని అబద్ధాలు మాట్లాడారు

    • దృష్టి పెట్టాల్సిన అనేక అంశాలు పక్కన పెట్టి కేసిఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడారు

    • 2024-25 కాగ్ రిపోర్ట్ లో అప్పు గురించి స్పష్టంగా చెప్పారు

    • రూ.6500 కోట్లు వడ్డీ కడుతున్నామని అవాస్తవాలు చెప్పారు

    • సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు

    • రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు

    • రూ.12వేల కోట్ల ఆదాయం వస్తుందని కాగ్ చెబుతోంది.

    • రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా

    • హైడ్రా తో దారుణంగా రాష్ట్ర ఆదాయం రూ.5వేల కోట్ల వరకు పడిపోతుంది

    • హైకోర్టు హెచ్చరిస్తున్నా కూల్చివేతలు ఆపడం లేదు

    • కొత్త విషయాలు ఏవీ మోడీ తో మాట్లాడలేదు

    • ఎస్‌ఎల్‌బీసీ విషయంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నారు.

  • 2025-02-27T11:51:10+05:30

    బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ

    • మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ -కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం

    • బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని కార్యకర్తల ఆందోళన

    • బీజేపీ కార్యకర్తలపై దూసుకెళ్ళిన కాంగ్రెస్ నేతలు

    • పరస్పరం రాళ్లు రువ్వుకున్న బీజేపీ -కాంగ్రెస్ కార్యకర్తలు

    • తీగల్ పహాడ్‌లో తీవ్ర ఉద్రిక్తత,

    • ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు,

    • పరిస్థితి ని సమీక్షిస్తున్నపోలీసు కమిషనర్ శ్రీనివాస్

  • 2025-02-27T11:47:16+05:30

    పోసాని సతీమణికి జగన్ ఫోన్

    • పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్

    • పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించిన వైయస్ జగన్

    • పోసాని అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని ధైర్యం చెప్పిన జగన్

    • కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందన్న జగన్

    • పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా

    • పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామన్న జగన్

  • 2025-02-27T11:41:56+05:30

    మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

    • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏకే టీపీ స్కూల్ వద్ద పోలింగ్ బూత్ ను సందర్శించిన ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు

      మంత్రి సత్య కుమార్ యాదవ్ కామెంట్స్

    • ఇప్పటివరకు 25 శాతం పోలింగ్ నమోదు

    • చదువుకున్న విద్యార్థులంతా ముందుకు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి.

    • పట్టభద్రుల ఓటు ద్వారా సరైన నాయకుడుని ఎన్నుకోవచ్చు

    • ప్రజలు ఇప్పటివరకు ఐదేళ్ల రాక్షస పాలన చూశారు

    • చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం మంచి పాలన చూస్తున్నారు

    • గడిచిన ఎనిమిది నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు , అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి.

    • సాయంత్రం లోపుగా ఎక్కువమంది వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి.

  • 2025-02-27T11:27:35+05:30

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలహలం

    • ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

    • ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్

    • తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి పోలింగ్

    • ఏపీలో కూటమి, పీడీఎఫ్ మధ్య తీవ్ర పోటీ

    • కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ మధ్య తీవ్రపోటీ

    • ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్