Share News

‘పీఎంఈజీపీ’ని వినియోగించుకోండి

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:49 PM

: పీఎంఈజీపీ యూనిట్లను విని యోగించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం విజయనగరం లోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ క్యాంపు కార్యాలయంలో గంట్యాడ మండలానికి చెందిన నాలుగు పీఎంఈజీపీ యూనిట్లను ప్రారంభించారు.

 ‘పీఎంఈజీపీ’ని వినియోగించుకోండి
లబ్ధిదారుడికి ఆటో తాళం అందజేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ :

విజయనగరం/కలెక్టరేట్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పీఎంఈజీపీ యూనిట్లను విని యోగించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం విజయనగరం లోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ క్యాంపు కార్యాలయంలో గంట్యాడ మండలానికి చెందిన నాలుగు పీఎంఈజీపీ యూనిట్లను ప్రారంభించారు.లబ్ధిదారులకు ఆటోయూ నిట్‌ తాళాలు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న పఽథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పొందిన యూనిట్లను లాభదాయకంగా నిర్వహించి కుటుంబ ఆర్థికస్థితిని మెరుగుపరుచుకోవాలని కోరారు.ఈపఽఽథకం కింద 35 శాతం మార్జిన్‌ మనీ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బ్యాంకు రుణాల రీపేమెంట్‌ను నిబంధనల ప్రకారం నిర్వహించాలని లబ్ధిదారులను కోరారు.కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సెర్ప్‌డీపీఎం హరేరామ్‌, ఏపీఎం సులోచనాదేవి, టీడీపీనాయకులు కొండప ల్లి కొండబాబు,కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ అర్జున్‌, గంట్యాడ టీడీపీ మండలా ధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు, విజయ్‌కుమార్‌, శాస్త్రి, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:49 PM