పక్కా రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:24 AM
గిరి శిఖర గ్రామా లకు డోలీ మోతలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే కూట మి ప్రభుత్వం పక్కా రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

కొమరాడ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): గిరి శిఖర గ్రామా లకు డోలీ మోతలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే కూట మి ప్రభుత్వం పక్కా రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గుణదతీలేసు పంచాయతీలో రూ.3.15 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును టీడీపీ మండల కన్వీనర్ శేఖర్‌పాత్రుడు ఆధ్వర్యంలో ఆమె గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సవర గుణద, గుణదతీలేసు వంటి గిరిజన గ్రామాలకు ఉపాధి నిధులతో బీటీ రోడ్లు నిర్మించడం ఆనందదాయక మని అన్నారు. అనంతరం ఉలిపిరి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు నూతనంగా మంజూరైన ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుణానుపురంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రహదారుల ను ప్రారంభించారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించా రు. ఈ కార్యక్రమంలో కురుపాం ఏఎంసీ చైర్మన్ కె.కళావతి, నియోజ కవర్గ జనసేన ఇన్‌చార్జి కడ్రక మల్లేష్, టీడీపీ నాయకులు పి.వెంకటనా యుడు, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.