Share News

ఆంధ్రజ్యోతి ఫోన్‌ ఇన్‌తో సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:46 AM

‘ఆంధ్రజ్యోతి ఫోన్‌ ఇన్‌’లో ఈ నెల 12న ప్రయాణికులు లేవనెత్తిన పలు సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్‌ఎం ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘చింతలపూ డికి చెందిన తొర్లపాటి బాబూరావు కోరిన విధంగా చింతలపూడి నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సును శనివారం ప్రారంభించాం.

ఆంధ్రజ్యోతి ఫోన్‌ ఇన్‌తో సమస్యలు పరిష్కారం
నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌

చింతలపూడి – విజయవాడ బస్సు ప్రారంభం

వినియోగంలోకి ఆకివీడు బస్టాండ్‌

ఉంగుటూరు, తణుకు బైపాస్‌లో ఎక్స్‌ప్రెస్‌లు నిలుపుదల

ఆర్టీసీ ఆర్‌ఎం వరప్రసాద్‌ వెల్లడి

భీమవరం టౌన్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి ఫోన్‌ ఇన్‌’లో ఈ నెల 12న ప్రయాణికులు లేవనెత్తిన పలు సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్‌ఎం ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘చింతలపూ డికి చెందిన తొర్లపాటి బాబూరావు కోరిన విధంగా చింతలపూడి నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సును శనివారం ప్రారంభించాం. ఉంగుటూరులో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నిలుపుదల చేయాలని స్థాని కుడు వంశీకృష్ణ అడిగిన విధంగా శనివారం నుంచి బస్సులు నిలుపుదల చేస్తున్నాం. ఏలూరు నుంచి మురళి, వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు మేరకు అధ్వానంగా వున్న ఏలూరు–విజయవాడ నాన్‌స్టాఫ్‌ బస్సులను మార్పు చేయించాం. జంగారెడ్డిగూ డెంలో డ్రైవర్‌పై వచ్చిన ఫిర్యాదుపై సమస్యను పరిష్కరించాం. ఆకివీడు వైస్‌ చైర్మన్‌ పుప్పాల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు స్థానిక బస్టాండ్‌ వినియోగానికి చర్యలు తీసుకునేలా భీమవరం అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ సురేష్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తిస్థాయి వినియోగానికి చర్యలు తీసుకుని, బస్సులన్నీ అక్కడకు వచ్చేలా ఆదేశాలు జారీ చేశాం. తణుకు బైపాస్‌ రోడ్డులోని షర్మిష్ట రెస్టారెంట్‌ వద్ద బస్సులు ఆగేలా చర్యలు తీసుకున్నాం. తణుకు డిపోకు చెందిన హైదరాబాద్‌, తిరుపతి బస్సులు పట్టణంలోకి వెళ్లి బైపాస్‌ రోడ్డులోని షర్మిష్ట వద్ద ఆగేలా చర్యలు తీసుకున్నారు. ఇతర జిల్లాల బస్సులు ఆపేలా సంబంఽధిత జిల్లాల అధికారులకు సమాచారం ఇస్తాం’ అని ఆర్‌ఎం వివరించారు.

నూతన బస్సు సర్వీసు ప్రారంభం

జంగారెడ్డిగూడెం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి, నూజి డు మీదుగా విజయవాడ వెళ్లే సూపర్‌ డీలక్స్‌ బస్సును ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ శనివారం ప్రారం భించారు. చింతలపూడి వరకు టీడీపీ నాయకులతో పాటు ఎమ్మెల్యే బస్‌ టిక్కెట్‌లు కొని ప్రయాణిం చారు. ‘జంగారెడ్డిగూడెం నుంచి నూజివీడు, చిం తలపూడి నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఈ బస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజు ఉదయం 5.30 గంటలకు జంగారెడ్డి గూడెం నుంచి బయలుదేరి పది గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం ఐదు గంట లకు విజయవాడ నుంచి బయలుదేరి పది గంట లకు వస్తుందని డీఎం గంగాధరరావు తెలిపారు.

Updated Date - Mar 23 , 2025 | 12:46 AM