Share News

పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:15 AM

పట్టణంలోని రెండు పొగాకు వేలం కేంద్రాలలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లను పొగాకు బోర్డు చైర్మన్‌ వై.యశ్వంత్‌ కుమార్‌ సోమవారం ప్రారంభించారు.

పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
పొగాకు వేలం ప్రారంభిస్తున్న బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌

ఆరంభ ధర కిలో రూ.290

తొలి రోజు రైతులకు నిరాశ

జంగారెడ్డిగూడెం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రెండు పొగాకు వేలం కేంద్రాలలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లను పొగాకు బోర్డు చైర్మన్‌ వై.యశ్వంత్‌ కుమార్‌ సోమవారం ప్రారంభించారు. ముందుగా వేలం కేంద్రం–32 వద్ద యశ్వంత్‌ కుమార్‌, వేలం కేంద్రం అధికా రులు, బయ్యర్లు పూజా కార్యక్రమాల అనంతరం వేలం ప్రారంభించారు. మొదటి రోజు 99 బేళ్లు వేలంకు రాగా కిలో పొగాకు రూ.290 ధర పలి కింది. వేలం కేంద్రం–18లో 99 బేళ్లు వేలంకు రాగా ఈ కేంద్రం లో కూడా కిలో పొగాకుకు రూ.290 ధర పలికింది.

యశ్వంత్‌ కుమార్‌ మట్లాడుతూ రాష్ట్ర వ్యా ప్తంగా వర్జీనియా పొగాకు 167 మిలియన్ల కిలో ల పొగాకు పండిచాలని పొగాకు బోర్డు రైతులకు నిర్దేశించిందని, రైతులు 240 మిలి యన్‌ కిలోల పొగాకు పండించారన్నారు. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని జంగారెడ్డిగూడెంలో 2, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురంలో కూ డా రైతులు అదనంగా పండించారన్నారు. రైతు ల వద్ద చివరి ఆకును కూడా పొగాకు బోర్డు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని, బయ ట అమ్మవద్దని ఆయన సూచించారు. వాతావర ణం అనుకూలించడంతో ఈ ఏడాది బ్రెజిల్‌లో 700 మిలియన్ల కిలోలు, జింబాబ్వేలో 300 మిలియన్ల కిలోల పొగాకు పండిందని తెలిపా రు. కర్ణాటకలో ఇంకా పొగాకు అమ్మకాలు జరుగతున్నాయని అక్కడ మార్కెట్‌ పూర్తవగానే ఏపీలో కొనుగోళ్లు ఊపందుకుంటాయన్నారు.

మొదటి రోజే నిరాశ..

మొదటి రోజు వేలంలో కిలో పొగాకుకు రూ. 300 పైగా ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన వేలంలో కిలో పొగాకు ధర రూ.290 పలికింది. ఈ ధర రైతులకు తీరని నష్టాన్ని తీసుకువస్తుందని జం గారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాల రైతు సంఘాల అధ్యక్షుడు పరిమి రాంబాబు, సత్రం వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. ఇదే ధర కొనసాగితే రైతులు అప్పులు ఊబిలో కూరుకు పోతారన్నారు. రైతులకు బోర్డు ఇచ్చిన లక్ష్యం మేరకు పండించిన పొగాకుకైనా యావరేజ్‌ ధర రూ.350, గరిష్ఠ ధర రూ.411 వచ్చేలా సహకరిం చాలని బోర్డు చైర్మన్‌ను కోరారు. వచ్చే పది రోజులు మార్కెట్‌ ధరలను పరిశీలిస్తామని తమకు గిట్టుబాటు ధరలు రాకపోతే రైతులంతా మాట్లాడుకుని భవిష్యత్‌ కార్యాచరణ రూపొం దించుకుంటామన్నారు. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో ఉన్న 5 పొగాకు వేలం కేంద్రాలను సమానం చేసి అమ్మకాలు జరిగేలా చూడాలని బోర్డు చైర్మన్‌ను కోరారు. ఆక్షన్‌ సూపరిండెంటెంట్‌లు బి.శ్రీహరి,జె.నరేంద్రకుమార్‌, రైతు సంఘం నా యకులు కరాటం రెడ్డిబాబు, గడ్డమణుగు సత్య నారాయణ, కొడవటి సత్తిరాజు, వామిశెట్టి హరి బాబు, గద్దే లక్ష్మణరావు, అట్లూరి సతీష్‌, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:15 AM