ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:18 AM
తాటియాకులగూడెంలో ఇటీవల గంధం బోసు (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు.

హత్య కేసును ఛేదించిన పోలీసులు
వివాహేతర సంబంధమే కారణం
భార్య, ప్రియుడి అరెస్ట్
జీలుగుమిల్లి, మార్చి, 24: (ఆంధ్రజ్యోతి): తాటియాకులగూడెంలో ఇటీవల గంధం బోసు (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. జీలుగుమిల్లి సీఐ బి.వెంకటేశ్వరావు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు తెలిపారు. గంధం బోసు గతంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఏడాది క్రితం అవకత వకల నేపథ్యంలో సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి భార్య శాంతకుమారి భర్త బోసు ఇద్దరి మధ్య తరచు వివాదాలు వస్తున్నాయి. శాంత కుమారికి తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం పేరాయిగూడెంకు చెందిన సొంగా గోపాలరావుతో పెళ్లికి ముందు నుంచి పరిచ యం ఉంది. అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. బోసు కూడా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య ను హింసించేవాడని, ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లు కట్టి అప్పుల పాలయ్యాడు. భార్య వద్ద డబ్బులు బలవంతంగా తీసుకునేవాడని, భర్త పెట్టే బాధలు పడలేక భర్తను వది లించుకోవాలని గోపాలరావుతో మాట్లాడింది. ఇద్దరు కలసి సరైన సమయం కోసం వేచి చూశారు.
జీలుగుమిల్లి తిరునాళ్ల నిర్వహణలో అవకత వకలు బయట పడ్డాయని ప్రచారం సాగింది. ఈ విషయమై ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరావు బోస్‌ను ఫోన్‌లో బెదిరించాడు. బెదిరింపు కాల్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఇదే అదునుగా తన భర్తను హతమా ర్చితే ఆ నెపం చిర్రి వెంకటేశ్వరావు మీదకు వెళు తుందని శాంతకుమారి, ఆమె ప్రియుడు గోపాల రావు భావించారు. ఈ నెల 17 తేదీ రాత్రి ప్రి యుడు గోపాలరావును ఇంటికి రమ్మని శాంత కుమారి ఫోన్‌లో మెసేజ్ చేసింది. భార్యభర్త, పిల్లలతో కలసి బయట వరండాలో నిద్రించారు. బోసు నిద్రపోతుండగా పథకం ప్రకారం గోపాల రావు ఇనుప రాడ్డుతో బోసు తలపై బలంగా కొట్టి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బోసును ఉదయం ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. కేసు విచారణలో నిందితుల సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురా లితో ఒక దినపత్రిక విలేకరి ఫోన్ చాటింగ్ వివ రాలు పోలీసులు గుర్తించారు. విలేకరిని కూడా విచారించి, అతడి ఫోన్ సిమ్ స్వాధీనం చేసుకు న్నారు. ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని, వారిని జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.