అక్రమ పదోన్నతులకు బ్రేక్
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:13 AM
నగరపాలక సంస్థలో అక్రమ పదోన్నతులకు బ్రేక్ పడింది.

ఏలూరు నగర పాలక సంస్థలో కార్మిక నాయకుడి ఫిర్యాదు
విజిలెన్స్ విభాగం విచారణ
నివేదిక కోరిన లోకాయుక్త
ఏలూరు టూటౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలో అక్రమ పదోన్నతులకు బ్రేక్ పడింది. నాలుగో తరగతి ఉద్యోగులు తొమ్మిది మందికి హెవీ వెహికల్ డ్రైవర్లుగా 2022 మార్చిలో ప్రమోషన్లు ఇచ్చారు. వీరిలో ఆరుగురికి అర్హత లేకున్నా ప్రమోషన్లు ఇచ్చా రంటూ కార్మిక నాయకుడు ఆర్‌టీఐ యాక్ట్ కింద వివరాలు అడిగి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యా దు చేశారు. విజిలెన్స్ విభాగం విచారణ ప్రారం భించింది. ఈ క్రమంలో మరో ఉద్యోగి తనకు అర్హత ఉన్నా ప్రమోషన్ ఇవ్వకుండా అర్హత లేని వారికి ఇచ్చారంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. లోకాయుక్త కోర్టు డ్రైవర్ల పదోన్నతులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సినదిగా డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్‌కు, రీజ నల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ విచారణ ప్రారంభించారు.
డీఎంఏ రీజనల్ డైరెక్టర్‌ను విచారణ అధికారి గా ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి ఆర్డీ నగరపాలక సంస్థ అధికారులను పదోన్న తులకు సంబంధించిన పూర్తి వివరాలతో విచారణకు రావాలని ఆదేశించారు. ఈనెల మార్చి 15న అత్యవసరంగా నగరపాలక సంస్థ పాలకమండలి స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆరుగురికి పదోన్నతులను రద్దు చేశారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి మూడేళ్ల అనుభవం ఉన్న ముగ్గురు డ్రైవ ర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. దీంతో ప్రమోషన్లు రద్దయిన ఆరుగురు తీవ్ర అసంతృప్తికి గుర య్యారు. అర్హత లేనప్పుడు మాకు ప్రమోషన్లు ఎందుకిచ్చారని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్రమోషన్లు ఇచ్చి పే ఫిక్సేషన్ చేయకుండా ఎందుకు కాలయాపన చేశారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమ వుతున్నట్టు సమాచారం. మరోవైపు తనకు అర్హత ఉన్నప్పటికి ప్రమోషన్లు ఇవ్వకుండా అనర్హులకి ఎందుకిచ్చారంటూ లోకాయుక్తకు వెళ్లిన ఉద్యోగి తనకు ప్రమోషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే అనర్హుల ప్రమోషన్లు రద్దు చేశా రని ఆరోపిస్తున్నాడు. అర్హత లేకపోయినా ఉద్యో గుల నుంచి లంచాలు తీసుకుని కొందరు అధికా రులు, ప్రజాప్రతినిధులు ప్రమోషన్లు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒక పక్క విజిలెన్స్ ఎంక్వైరీ, మరోపక్క కలెక్టర్ విచారణ, ముఖ్యంగా లోకయుక్త ఆదేశాలతో నగర పాలక సంస్థ అధికారులు, పాలకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.