Share News

SRH IPL 2025: మనోడని నమ్మితే ముంచేశాడు.. ఎంత పని చేశావ్ సమద్

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:28 PM

Indian Premier League: ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఏ ఆటగాడు కూడా ఒకే టీమ్‌లో ఉండిపోవాలనే రూల్ ఏమీ లేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. ప్లేయర్లు-టీమ్స్‌ను విడదీసి చూడరు.

SRH IPL 2025: మనోడని నమ్మితే ముంచేశాడు.. ఎంత పని చేశావ్ సమద్
SRH vs LSG

ఇంటర్నేషనల్ క్రికెట్ కంటే ఫ్రాంచైజీ క్రికెట్ చాలా డిఫరెంట్. ఈ తరహా క్రికెట్‌లో ఆటగాళ్లు ఒకే టీమ్‌లో ఆడాలనే నిబంధన లేదు. ప్లేయర్లకు నచ్చకపోయినా, భారీ ధర కావాలనుకున్నా ఇతర జట్లకు మారొచ్చు. ఆటగాళ్లు తమకు వద్దని ఫ్రాంచైజీలు భావించినా మారక తప్పదు. లాయల్టీకి ఇక్కడ చోటు ఉండదు. అయితే అభిమానులు మాత్రం ఆటగాళ్లు-ఫ్రాంచైజీలతో కనెక్ట్ అవుతారు. అందుకే రిటెన్షన్‌లు జరిగినప్పుడు ఎమోషనల్ అవుతుంటారు. ఒక టీమ్‌లోని ఆటగాళ్లు ఇంకో టీమ్‌కు మారి.. పాత జట్టు మీద చెలరేగితే ఫీల్ అవుతారు. సన్‌రైజర్స్ అభిమానులు ఇప్పుడు ఇలాగే బాధపడుతున్నారు. మనోడే మనకు విలన్ అయ్యాడని.. మనోడు అనుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పగోడు అయ్యాడని బాధపడుతున్నారు.


చూస్తుండగానే ఖేల్‌ఖతం

ఐపీఎల్-2025లో తొలి ఓటమిని చవిచూసింది కమిన్స్ సేన. లక్నో సూపర్ జియాంట్స్‌తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడింది ఎస్‌ఆర్‌హెచ్. అయితే ఓటమి కంటే కూడా సన్‌రైజర్స్ పాత ప్లేయర్లు చెలరేగి ఆడటం, ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం ఫ్రాంచైజీతో పాటు అభిమానులను హర్ట్ చేస్తోంది. అప్పట్లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడిన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ నిన్నటి మ్యాచ్‌లో 31 బంతుల్లో 52 పరుగులు చేశాడు. లాస్ట్ సీజన్ వరకు ఆరెంజ్ ఆర్మీలో ఉన్న పించ్ హిట్టర్ అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 22 పరుగులతో చూస్తుండగానే మ్యాచ్‌ను ముగించాడు. దీంతో మనోళ్లే మన టీమ్‌ను ముంచేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


ఇవీ చదవండి:

ఆ ముగ్గురూ ఆడకపోతే ఎస్‌ఆర్‌హెచ్ తుస్సేనా

కావ్యా పాపను బాధపెట్టారు కదరా..

వాళ్ల వల్లే మ్యాచ్ పోయింది:కమిన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2025 | 02:32 PM