అయ్యర్‌కు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:50 AM
భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు మళ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశాలున్నాయి...

న్యూఢిల్లీ: భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు మళ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశాలున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడా లనే బోర్డు సూచనలను పెడచెవిన పెట్టడంతో 2023-24కు గాను అయ్యర్‌తోపాటు ఇషాన్ కిషన్‌కు బోర్డు కాంట్రాక్ట్‌లు దక్కలేదు. కానీ, శ్రేయాస్ మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంతో అతడిపై సానుకూల దృక్పథం ఏర్పడింది. దీంతో త్వరలో ప్రకటించనున్న 2024-25 కాంట్రాక్ట్‌ల జాబితాలో అయ్యర్ పేరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇషాన్ మాత్రం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీలకు మరోసారి ఏ+ కాంట్రాక్ట్ ఖాయమని తెలుస్తోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా బోర్డు కాంట్రాక్ట్ దక్కనున్నట్టు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..