Share News

Vastu Tips: ఇంట్లో అద్దం పగిలిపోవడం శుభమా.. లేదా అశుభమా..

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:38 PM

వాస్తు శాస్త్ర నియమాలు మన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తాయి. దీనితో పాటు, ఇంట్లో సానుకూల శక్తి నివసిస్తుంది. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో అద్దం పగలిపోవడం శుభమా లేదా అశుభమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: ఇంట్లో అద్దం పగిలిపోవడం శుభమా.. లేదా అశుభమా..
Broken Glass

Vastu Tips: వాస్తు శాస్త్రంలోని ప్రతి నియమం మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. అలాగే, మనం చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే, మన జీవితంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అలా కాకుండా, మనం వాస్తు నియమాలను విస్మరిస్తే, ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దం పగలిపోవడం శుభమా లేదా అశుభమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


అద్దం పగలిపోవడం మంచిదా.. చెడ్డదా?

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో అద్దం పగలడం వెనుక రెండు అర్థాలు ఉండవచ్చు. మొదటిది, ఒక అద్దం తెలిసి లేదా తెలియకుండా పగిలిపోతే, దానిని శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంటికి వచ్చే ఏదైనా విపత్తును నివారిస్తుందని, అలాగే జీవితంలో ప్రత్యేకమైనది జరగబోతోందని చెబుతారు. మరొక నమ్మకం ప్రకారం, మీరు అనుకోకుండా అద్దం పగలగొడితే, అది మీ జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. అలాగే రాబోయే పెద్ద సంక్షోభాన్ని కూడా సూచిస్తుందని నమ్ముతారు.

అయితే, కొంతమంది తమ ఇళ్లలో పగిలిన అద్దంను ఉపయోగిస్తారు. పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకోవడం చాలా అశుభం అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది తీవ్రమైన ఇబ్బందులకు దారితీస్తుందని,ఇంట్లో పగిలిన అద్దంను ఉపయోగించడం ఏ మాత్రం మంచిది కాదని సూచిస్తుంది.


Also Read:

ఈ వారమంతా వీరికి లక్కేలక్కు..

ఈ రాశి వారికి కష్టాలు మాయమై కొత్త జీవితం ప్రారంభమవుతుంది

Updated Date - Apr 07 , 2025 | 02:04 PM